UPSC Civils Final Results Out: యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల, అభ్యర్థుల లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2023 పరీక్ష తుది ఫలితాలు వెల్లడయ్యాయి.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
అఖిల భారత సర్వీసుల్లోని మొత్తం 1,105 సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, మే28న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. మెయిన్స్‌కు మొత్తం 14,624 మంది అభ్యర్థులు ఎంపిక కాగా, మొత్తం దేశ వ్యాప్తంగా సివిల్స్ ఇంటర్వ్యూలకు 2, 844 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 90 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తాజాగా విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో మొత్తం 1016 మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు ఎంపికయ్యారు.
ఇక, అర్హత సాధించినవారిలో జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 115 మంది, ఓబీసీ నుంచి 303 మంది, ఎస్సీ నుంచి 165, ఎస్టీ నుంచి 86 మంది ఉన్నారు. వీరిలో సివిల్స్ లో అత్యున్నత ఉద్యోగాలైన ఐఏఎస్ కు 180 మంది, ఐపీఎస్ కు 200 మంది, ఐఎఫ్ఎస్ కు 37 మందిని ఎంపిక చేశారు.