Skip to main content

TSPSC: మరో రెండు పరీక్షలు రీషెడ్యూల్‌

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్, ఇంటర్మీడియట్‌ విద్యా విభాగంలో ఫిజికల్‌ డైరెక్టర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షలను తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వాయిదా వేసింది.
TSPSC
మరో రెండు పరీక్షలు రీషెడ్యూల్‌

ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే నెలలో ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా... వీటిని ఏకంగా నాలుగు నెలల పాటు వాయిదా వేసింది. సెప్టెంబర్‌లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు తేదీలతో కూడిన సబ్జెక్టుల వారీ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను మే 5 రాత్రి విడుదల చేసింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

మే 13న నిర్వహించాల్సిన పాలిటెక్నిక్‌ కాలేజీ లెక్చరర్‌ ఉద్యోగాల పరీక్షలు సీబీఆర్‌టీ(కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌) పద్ధతిలో సెప్టెంబర్‌ 4వ తేదీనుంచి 8వరకు ఉదయం, మధ్యాహ్నం జరగనున్నాయి. మే  17వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరగాల్సిన ఇంటర్మీడియట్‌ బోర్డు పరిధిలో ఫిజికల్‌ డైరెక్టర్‌ ఉద్యోగ అర్హత పరీక్ష సెప్టెంబర్‌ 11వ తేదీ ఉదయం, మధ్యాహ్నం సీబీఆర్‌టీ పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. 

Published date : 06 May 2023 05:14PM

Photo Stories