Skip to main content

TSPSC Speed Up The Recruitment Process: ఉద్యోగాల భర్తీ వేగవంతం,ధ్రువపత్రాల పరిశీలనకు ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి..

8180 Positions Available   TSPSC Speed Up The Recruitment Process   Group-4 Job Openings  TSPSC

ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే పలు కేటగిరీల్లో ఉద్యోగాలకు సంబంధించి జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ (జీఆర్‌ఎల్‌)ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ (175), డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ (18), హార్టీకల్చర్‌ ఆఫీసర్‌ (22), ఇంటర్మీడియట్‌ బోర్డు పరిధిలోని లైబ్రేరియన్‌ (77), అసిస్టెంట్‌ మోటార్‌ Ððవెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (117), గ్రూప్‌–4 (8180) పోస్టులకు సంబంధించి వెబ్‌సైట్‌లో జీఆర్‌ఎల్‌ అందుబాటులో ఉంది.

ఈ క్రమంలో కేటగిరీల వారీగా మెరిట్‌ సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను కమిషన్‌ అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే వేగంగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి ఆ తర్వాత తుది జాబితాలు విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కోసం అన్ని రకాల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. 

ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి 
విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు అభ్యర్థులు అందుబాటులో ఉంచుకోవాలి. అదేవి ధంగా ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు, వివిధ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులు కమిషన్‌ నిర్దేశించిన తేదీలతో కూడిన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవా లి. ఏ క్షణంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు ఖరారు కావచ్చునని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
 
మున్సిపల్‌ శాఖలో వివిధ పోస్టులకు జీఆర్‌ఎల్‌ విడుదల 
పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అకౌంట్స్‌ ఆఫీసర్, జూనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు సంబంధించిన జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును కమిషన్‌ విడుదల చేసింది. ఈ జాబితాను కమిన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published date : 22 Feb 2024 12:21PM

Photo Stories