TSPSC: పేపర్ లీకేజీలో టీఏ సస్పెండ్
మండలంలోని సల్కర్‌పేట్‌కు చెందిన తిరుపతయ్య 2007 నుంచి టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మొదట 5ఏళ్లు స్థానిక మండల పరిషత్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత వికారాబాద్ జిల్లా దోమ, కుల్కచర్ల మండలాల్లో విధుల్లో కొనసాగారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో పనిచేస్తూ 2020లో తిరిగి మండలంలో విధుల్లో చేరాడు. ఇటీవల టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీలో ఏఈ పేపర్ విక్రయంలో మధ్యవర్తిగా ఇతను వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించి ఇతన్ని అరెస్టు చేశారు.
చదవండి: TSPSC: సిబ్బందే లీక్ చేస్తారని ఊహించలేదు
దీంతో స్థానిక ఎంపీడీఓ రూపేందర్‌రెడ్డి మార్చి నెల 25న విధులకు గైర్హాజరయ్యాడని ఫోన్ కూడా పనిచేయలేదని, పేపర్ లీకేజీలో ఇతని ప్రమేయం ఉందని డీఆర్‌డీఓ యాదయ్యకు ఫిర్యాదు చేశారు. ఆయన కలెక్టర్‌కు నివేదించడంతో అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్‌డీఓ యాదయ్య ఈమేరకు గండేడ్ ఎంపీడీఓ కార్యాలయానికి మెయిల్ పంపారు. ఈమేరకు ఎంపీడీఓ పంచాయతీ సిబ్బందితో సస్పెండ్ ఉత్తర్వులు సల్కర్‌పేట్‌లోని తిరుపతయ్య ఇంటికి అతికించారు.