Skip to main content

TSPSC: కొలువుల అర్హత పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: పలు ఉద్యోగ నియామకాల అర్హత తేదీలను తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఖరారుచేసింది.
TSPSC
కొలువుల అర్హత పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

ఇంటర్మీడియట్‌ విద్య కమిషనరేట్‌ పరిధిలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగ అర్హత పరీక్షలను సెప్టెంబర్‌ 12 నుంచి సబ్జెక్టుల వారీగా నిర్వహించనున్నట్లు స్పష్టంచేసింది. అన్ని సబ్జెక్టులకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలన్నీ కంప్యూటర్‌ బేస్డ్‌ రి­క్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్టీ) విధానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్‌ 12న ప్రా­రంభం కానున్న పరీక్షలు అక్టోబర్‌ 3 వరకు దాదాపు 11 రోజులపాటు పరీక్షలు కొనసాగనున్నాయి.   

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఆగస్టు 8న ఏఓ, జేఏఓ పరీక్ష..: పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని పట్టణ స్థానిక సంస్థ (యూఎల్‌బీ)ల్లోని అకౌంట్స్‌ ఆఫీసర్‌ (ఏఓ), జూ­ని­యర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (జేఏఓ) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షను ఆగస్టు 8న నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. నిర్దేశించిన రోజున ఉదయం, మధ్నాహ్నం రెండు సెషన్లలో ప­రీక్షలను సీబీఆర్‌టీ పద్ధతిలో నిర్వహించనున్నట్లు వె­ల్లడించింది. పై అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష తేదీకి వారం ముందు హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పింది.  

Published date : 24 May 2023 01:50PM

Photo Stories