TSPSC: లైబ్రరీల్లో పోస్టుల భర్తీ... ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్, ఉన్నత విద్యాశాఖ నియంత్రణలో ఉన్న గ్రంథాలయాల్లోని ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నేటి నుంచి హాల్‌టికెట్ https://tspsce. gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(సీబీఆర్‌టీ)తో నిర్వహించనున్న లైబ్రేరియన్ పరీక్ష మే 17న ఉదయం 10 గంటల నుంచి 12–30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2–30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని మే 9న ఓ ప్రకటనలో వెల్లడించింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 45 నిమిషాల ముందే రావాలని పేర్కొంది. పరీక్ష విధానంపై మాక్ టెస్టు కోసం https://www..digialm. com:443//onlineassessment/index.html?1222@m2ను చూడాలని విద్యార్థులకు సూచించింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్
Published date : 10 May 2023 03:49PM