రవాణాశాఖలో Assistant Motor Vehicle Inspector (AMVI) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణను Telangana State Public Service Commission వాయిదా వేసింది.
ఏఎంవీఐ దరఖాస్తుల స్వీకరణ వాయిదా
113 ఏఎంవీఐ ఉద్యోగాల భర్తీకి TSPSC జూలై 27వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్ పద్ధతిలో స్వీకరించాల్సి ఉంది. కానీ దరఖాస్తుల స్వీకరణలో సాంకేతిక కారణాలు నెలకొన్నట్లు TSPSC ప్రకటించింది. త్వరలో దరఖాస్తులను స్వీకరిస్తామని, ఇందుకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నట్లు కమిషన్ ఆగస్టు 4న ఒక ప్రకటనలో తెలిపింది.