Skip to main content

High Court: గ్రూప్‌–1 పరీక్షలు వాయిదా వేయండి.. ఈ కమిషన్‌కు నిర్వహణ బాధ్యత అప్పగించండి

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ దర్యాప్తు పూర్తయ్యే వరకు గ్రూప్‌–1 పరీక్షలు ఆపాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైన పిటిషన్లలో కౌంటర్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
High Court
గ్రూప్‌–1 పరీక్షలు వాయిదా వేయండి.. ఈ కమిషన్‌కు నిర్వహణ బాధ్యత అప్పగించండి

తదుపరి విచారణను జూన్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. సిట్, ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు గ్రూప్‌–1 పరీక్ష ఆపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. టీఎస్‌పీఎస్సీ సిబ్బందిలో ఎంత మందికి లీకేజీతో సంబంధం ఉందో తెలియకుండా అదే కమిషన్‌ పరీక్షలు నిర్వహించడం సరికాదని పిటిషనర్లు పేర్కొన్నారు. యూపీపీఎస్సీ లాంటి కమిషన్‌కు పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించాలని సూచించారు. ఈ పిటిషన్‌లపై జూన్‌ 1న జస్టిస్‌ కాజా శరత్‌ విచారణ చేపట్టారు. గత ఏడాది గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షలు పూ ర్తయ్యాక ప్రశ్నపత్రాలు లీకేజీ విషయం వెలుగులోకి వచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. దీనిపై సర్కార్‌ ఏర్పాటు చేసిన సిట్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారన్నారు. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ |ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

మళ్లీ టీఎస్‌పీఎస్సీ నిర్వహణ అంటే ఎలా? 

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని తేలిందని, ఇప్ప టికే 19 మంది దాకా అరెస్టయ్యారని చెప్పారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని, అలాంటప్పుడు అదే సంస్థ పరీక్ష ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. ఆ బాధ్యతను మరో సంస్థకు అప్పగించాలని కోరారు. టీఎస్‌పీఎస్సీ తరఫున న్యాయవాది ఎం. రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ.. లీకేజీ అంశంలో 19 మంది ఉద్యోగులు లేరన్నారు. ఉన్న ఇద్దరు కూడా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 991 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు చేశామని, పగడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పా రు. వాదనలను విన్న న్యాయమూర్తి.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.

Published date : 02 Jun 2023 03:44PM

Photo Stories