Jobs: ఏఎంవీఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఏ జోన్‌లో ఏన్ని ఖాళీలో తెలుసుకోండి..
Sakshi Education
రవాణా శాఖలో 113 Assistant Motor Vehicle Inspector (AMVI) పోస్టుల భర్తీకి Telangana State Public Service Commission (TSPSC) జూలై 27న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రస్తుతం భర్తీ చేయనున్న పోస్టుల్లో మల్టీజోన్–1 నుంచి 54 పోస్టులు, మల్టీజోన్–2 నుంచి 59 పోస్టులున్నాయి. అగష్టు 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి సెప్టెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థుల వయోపరిమితి జూలై 1, 2022 నాటికి 21 ఏళ్ల నుంచి 39 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఏడాది నవంబర్‌లో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు TSPSC నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ పరీక్షను సీబీఆర్టీ లేదా ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్| గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్
Published date : 28 Jul 2022 12:19PM