Group I: Prelims Key పై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు!
![Group I](/sites/default/files/images/2022/12/16/key-sakshi-neet-16597924241-1671173214.jpg)
ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసిన కమిషన్... ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ చేపట్టింది. నవంబర్ 4తో ప్రాథమిక కీ అభ్యంతరాల స్వీకరణ పూర్తికాగా, పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. అయితే మొత్తంగా ఎన్ని అభ్యంతరాలు వచ్చాయనే విషయాన్ని కమిషన్ వెల్లడించలేదు. మరోవైపు ప్రాథమిక కీ పైన వచ్చిన అభ్యంతరాల పరిశీలనకు టీఎస్‌పీఎస్సీ కార్యాచరణ సిద్ధంచేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను లోతుగా పరిశీలించాలని నిర్ణయించిన టీఎస్‌పీఎస్సీ.. ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
☛ TSPSC Group 1 - 2022 Question Paper with Key (held on 16.10.22)
నవంబర్ 7 నుంచి అభ్యంతరాల పరిశీలన చేపట్టనున్నట్లు సమాచారం. వాటిలో సమ్మతమైనవెన్ని?... ప్రశ్నపత్రంలో తప్పొప్పులున్నాయా? తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి తుది కీ ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లోగా పరిశీలన పూర్తి చేయాలని భావిస్తున్న కమిషన్.. ఈ ప్రక్రియ ముగిస్తే వచ్చే వారంలో తుది కీని విడుదల చేయనుంది. ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 3.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, నవంబర్ 16న పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు.