Skip to main content

Degree Lecturer Results: గురుకుల డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్‌(డీఎల్‌) ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) విడుదల చేసింది.
Final Results Declared for DL Posts in Welfare Gurukula Degree Colleges   Telangana Gurukula Educational Institutions Recruitment Board Announcement  Degree Lecturer Results   TREIRB Welfare Gurukula Degree Colleges Recruitment

22 సబ్జెక్టులకు 700 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ ఫిబ్ర‌వ‌రి 28న‌ రాత్రి బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించేలా బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

చదవండి: TSPSC గ్రూప్-1 నోటిఫికేషన్ 2024 విడుదల: ముఖ్యమైన తేదీలు ఇవే!

ఇక జూనియర్‌ కాలేజీల్లో 1,924 ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చింది. ఫిబ్ర‌వ‌రి 29న‌ సాయంత్రానికల్లా జేఎల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను బోర్డు విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

కాగా, మెడికల్‌ బోర్డు నుంచి అభ్యర్థులు డిజేబిలిటీ ధ్రువీకరణకు అంశం పెండింగ్‌లో ఉండటంతో పర్సన్‌ విత్‌ డిజేబుల్‌ కేటగిరీలో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులను ఇంకా ఖరారు చేయనట్లు సమాచారం.  

Published date : 29 Feb 2024 03:10PM

Photo Stories