Group 1 Prelims: ‘లీకేజీ’ని సీబీఐకి అప్పగించాలి
పిల్‌పై అభ్యంతరాలను పక్కకు పెట్టి, పిటిషన్‌కు నంబర్ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం ఆగస్టు 16న రిజిస్ట్రీని ఆదేశించింది. ఫైలింగ్ నంబర్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్, హైదరాబాద్ సీపీ, సీబీఐ డైరెక్టర్‌కు నోటీసులిచ్చింది.
అలాగే పేపర్ లీకేజీ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో నివేదిక అందజేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఏప్రిల్‌లో దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలతో ఈ పిల్ దాఖలైంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రిజిస్ట్రీ నంబర్ కేటాయించలేదు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
సీజే ధర్మాసనం వద్ద విచారణ సందర్భంగా హోం శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రూపేందర్ వాదనలు వినిపిస్తూ.. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ ఇప్పటికే సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉందన్నారు.
ఆ పిటిషన్ విచారణ సందర్భంగా నిందితులపై కేసు నమోదు, అరెస్టు, దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది.. వంటి అంశాలపై సిట్ మూడు నివేదికలను కూడా కోర్టుకు సమర్పించిందన్నారు. ఈ పిల్ దాఖలు చేసిన పిటిషనర్ బక్క జడ్సన్.. కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్పారు. నిష్పక్షపాతంగా సిట్‌ను దర్యాప్తు చేయకుండా ధిక్కరణ పిటిషన్లు కూడా వేస్తూ అడ్డుకుంటున్నారని చెప్పారు.