TSPSC: గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష తేదీలు ఇవే..
మొదట జనరల్ ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించాక ఆ మర్నాటి నుంచి పేపర్–1 మొద లు పేపర్–6 పరీక్షలు వరుసగా నిర్వహించనుంది. దీనికి సంబంధించిన వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రతి పరీక్ష ను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. ఒక్కోపరీక్షలో గరిష్ట మార్కులు 150 చొప్పున ఉంటాయి. గ్రూప్–1 రాత పరీక్షలను ఆంగ్లం, తెలుగు, ఉర్దూలలో ఏదో ఒక భాషను ఎంచుకుని అభ్యర్థులు పరీక్షలు రాయా ల్సి ఉంటుంది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఒక్కో పరీక్షను ఒక్కో భాషలో రాసేందుకు వీల్లేదని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష ఎస్‌ఎస్‌సీ స్థాయిలో నిర్వహిస్తామని, ఈ పరీక్ష కేవలం అర్హతతో ముడిపడి ఉంటుందని, ఇందులో వచ్చే మార్కులను ర్యాంకింగ్ లో పరిగణించబోమని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులు ప్రతి పరీక్షనూ తప్పకుండా రాయాలని, ఒక్క పరీక్ష కు గైర్హాజరైనా వారి అర్హత రద్దవుతుందని టీఎస్‌పీఎస్సీ జనవరి 31న ఒక ప్రకటనలో తెలిపింది.
పరీక్ష కేటగిరీ |
సమయం |
మార్కులు |
తేదీ |
జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్) |
3 |
150 |
05–06–2023 |
పేపర్–1 జనరల్ ఎస్సే |
3 |
150 |
06–06–2023 |
పేపర్–2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ |
3 |
150 |
07–06–2023 |
పేపర్–3 ఇండియన్ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్ |
3 |
150 |
08–06–2023 |
పేపర్–4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ |
3 |
150 |
09–06–2023 |
పేపర్–5 సైన్స్, టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ |
3 |
150 |
10–06–2023 |
పేపర్–6 తెలంగాణ మూవ్‌మెంట్, స్టేట్ ఫార్మేషన్ |
3 |
150 |
12–06–2023 |