Competitive Examinations: పోటీ పరీక్షలపై అవగాహన
Sakshi Education
జనగామ: టీఎస్‌పీఎస్‌సీ పోటీ పరీక్షల నిర్వహణపై నిరుద్యోగ యువతీ, యువకులకు అవగాహన కల్పించేందుకు పట్టణంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాలలో మార్చి 15న ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.నర్సయ్య అధ్యక్షతన తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్, కెరియర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గ్రూప్–1లో 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మార్చి 16వ తేదీ వరకు చివరి అవకాశం కాగా, జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందన్నారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
గత ఏడాది 783 గ్రూప్–2 పోస్టులకు గాను, ఆగస్టు 7, 8న, 1,388 పోస్టులకు నిర్వహించే గ్రూప్–3 పరీక్ష నవంబర్ 17, 18 తేదీల్లో జరుగుతుందన్నారు. పోటీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తాము ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
Published date : 16 Mar 2024 05:15PM