Skip to main content

TSPSC: ఏఎంవీఐ అభ్యర్థుల హాల్‌టికెట్లు సిద్ధం.. ఈసారి పరీక్ష ఇలా!!

సాక్షి, హైదరాబాద్‌: రవాణా శాఖ లో అసిస్టెంట్‌ మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎంవీఐ) ఉద్యోగాల భర్తీ అర్హత పరీక్ష జూన్‌ 28న సీబీటీ పద్ధతిలో ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో జరగనుంది.
TSPSC
ఏఎంవీఐ అభ్యర్థుల హాల్‌టికెట్లు సిద్ధం.. ఈసారి పరీక్ష ఇలా!!

హాల్‌టిక్కెట్లు కమిషన్‌ వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచిన ట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి జూన్‌ 20న ఒక ప్రకటనలో తెలిపా రు. అభ్యర్థులు వెంటనే హాల్‌టి క్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, చివరి నిమిషంలో ఇబ్బంది పడొద్దని కార్యదర్శి సూచించారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఈ డ్రైవింగ్‌ లైసెన్సు ఉంటేనే ఏఎంవీఐ పోస్టుకు అర్హులు

ముందస్తు ప్రకటన లేకుండా ఉద్యోగ అర్హత నిబంధనల్లో మార్పులు చేయటం మహిళా అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ఉద్యోగం రావటం, రాకపోవటం సంగతి అటుంచితే కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేని స్థితి ఏర్పడింది. రవాణాశాఖలోని Assistant Motor Vehicle Inspector (AMVI) 113 పోస్టుల భర్తీకి TSPSC తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. మల్టీజోన్‌–1లో 54, మల్టీజోన్‌–2లో 59 పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. వీటిలో మహిళలకు 41 పోస్టులు రిజర్వ్‌ చేసింది.

 TSPSC AMVI Hall Tickets 2023 out; Check download link here

మెకానికల్‌ ఇంజినీరింగ్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ, లేదా తత్సమాన విద్యార్హత, మూడేళ్ల ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమాలను విద్యార్హతలుగా ఖరారు చేసింది. ఆగస్టు 5 నుంచి సెప్టెంబరు ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇంతవరకు బాగానే ఉంది. నోటిఫికేషన్‌ వెలువడ్డ తేదీ నాటికి మహిళా అభ్యర్థులు కూడా కచ్చితంగా హెవీ మోటార్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు పొంది ఉండాలని నిబంధన విధించింది. ఇక్కడే చిక్కొచ్చి పడింది. గతంలో ఈ పోస్టుకు ఈ నిబంధన లేదు. మహిళలకు మినహాయింపు ఉండటంతో చాలామంది ఆ లైసెన్సు తీసుకోలేదు.

దీంతో ఇప్పుడు వారెవరూ దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కనీసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ వరకు లైసెన్సు తీసుకుని ఉండేలా నిబంధన మార్చాలని మహిళా అభ్యర్థులు కోరుతున్నారు. ఆ లైసెన్సు తీసుకోవటానికి తగు సమయం ఇవ్వాలని, తరువాతే దరఖాస్తులు ఆహ్వానించాలని కోరుతు న్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు కొందరు అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో, ఆమేరకు సడలింపు ఇస్తే బాగుంటుందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దానికి సానుకూలంగా నిబంధన మార్చాలని నిర్ణయించినట్టు తెలిసింది.

Published date : 21 Jun 2023 02:55PM

Photo Stories