Skip to main content

TSPSC: ప్రశాంతంగా ఏఈఈ అర్హత పరీక్ష.. వెబ్‌సైట్‌లో ఈ పరీక్ష హాల్‌టికెట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ఇంజనీరింగ్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఏఈఈ) అర్హత పరీక్ష తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది.
TSPSC
ప్రశాంతంగా ఏఈఈ అర్హత పరీక్ష

ఇదివరకు ఓఎంఆర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించిన తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌... ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పునర్నిర్వహణ చేపట్టింది. మే 8, 9 తేదీల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(సీబీఆర్‌టీ) పద్ధతిలో పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. తొలిరోజైన మే 8న కొన్ని కేటగిరీలకు ఉదయం 10గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రెండు సెషన్లు నిర్వహించింది. కాగా, మే 8న ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో హయత్‌నగర్‌తో పాటు పలుచోట్ల అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. 

చదవండి: TSPSC: ఏఈ పేపర్‌ ‘చూపించడానికి’ రూ.2 లక్షలు!

వెబ్‌సైట్‌లో ఏఓ హాల్‌టికెట్లు 

మే 16వ తేదీన జరగనున్న వ్యవసాయ సహకార శాఖల్లో అగ్రికల్చర్‌ ఆఫీసర్‌(ఏఓ) పరీక్ష హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 

చదవండి: TSPSC: 10 కొత్త పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

Published date : 09 May 2023 05:56PM

Photo Stories