Skip to main content

Police Training: 16 నుంచి ఎస్సై అభ్యర్థులకు శిక్షణ!.. అపాయింట్‌మెంట్‌ మాత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో సివిల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) అభ్యర్థులకు మరికొద్ది రోజుల్లోనే శిక్షణ ప్రారంభం కానుంది.
Police Training, starts on Sept 16,collect letters on Sept 9,Report,Police Academy on Sept 10
16 నుంచి ఎస్సై అభ్యర్థులకు శిక్షణ!.. అపాయింట్‌మెంట్‌ మాత్రం

సెప్టెంబర్‌ 16 నుంచి పూర్తిస్థాయిలో శిక్షణను అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిసింది. కాగా, సెప్టెంబర్‌ 9న రేంజ్‌ కార్యాలయాల్లో ఎస్సై అభ్యర్థులు అపాయింట్‌మెంట్‌ లెటర్లు తీసుకుని 10వ తేదీన తెలంగాణ పోలీస్‌ అకాడమీలో రిపోర్టు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్‌ పోలీస్‌ అకాడమీలో సంస్థ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య, పోలీస్‌ నియామక మండలి చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌రావు, అకాడమీ ఉన్నతాధికారులు, ట్రైన్లర్లతో కలసి సెప్టెంబర్‌ 6న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ...సమస్యల పరిష్కారంలో నిపుణత పెంచేలా ఎస్సైల శిక్షణ ఉండాలని సూచించారు. 

చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్

Published date : 07 Sep 2023 11:38AM

Photo Stories