Skip to main content

TSPLRB: పోలీస్‌ కొలువుకు గట్టి పోటీ!

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ కొలువులకు పోటీ తీవ్రంగానే ఉండే అవకాశాలు క న్పిస్తున్నాయి.
TSPLRB
పోలీస్‌ కొలువుకు గట్టి పోటీ!

ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షల్లో విజయం సాధించిన వారంతా ఇప్పుడు తుది రాత పరీక్షపై దృష్టి సారించారు. ఎలాగైనా ఖాకీ యూనిఫాం ధరించాలన్న లక్ష్యంతో ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అయితే పోలీసు ఉద్యోగం అంత సులువుగా దక్కే అవకాశం లేదని పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య చెబుతోంది. సివిల్‌ ఎస్సై మొదలు డ్రైవర్‌ పోస్టు వరకు ప్రతి దానిలో పోటీ తీవ్రంగానే ఉంది. పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల్లోని వివిధ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్‌ కలిపి.. మొత్తం 11 రకాల పోస్టుల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఆయా పోస్టులకు మార్చి 12 నుంచి జరిగే తుది రాత పరీక్షకు టీఎస్‌ఎల్పీఆర్బీ ఏర్పాట్లు చేస్తోంది. 

చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్

పోటీ ఉన్న కొన్ని పోస్టులను పరిశీలిస్తే.. 

  • సివిల్‌ ఎస్సై మొత్తం పోస్టులు 554 భర్తీ చేయాల్సి ఉండగా..తుది రాత పరీక్షకు 41,256 మంది పురుషులు, 11,530 మంది మహిళలు పోటీ పడుతున్నారు. సరాసరిన ఒక్కో పోస్టుకు 95 మంది పోటీ పడుతున్నారు. 
  • సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులు 15,644 భర్తీ చేయనున్నారు. భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నా...పోటీపడే అభ్యర్థుల సంఖ్యా అదే స్థాయిలో ఉంది. సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఏకంగా 22,882 మంది మహిళలు, 67,606 మంది పురుషులు పోటీలో ఉన్నారు. ఒక్కో పోస్టుకు దాదాపుగా ఆరుగురు బరిలో ఉన్నారు. 
  • మొత్తం 614 ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు గాను తుది రాత పరీక్షకు 59,325 మంది పోటీలో ఉన్నారు. అంటే ఒక్కో పోస్టుకు సరాసరిన 96 మంది పోటీ పడుతున్నారు. 
  • ఇక అత్యంత పోటీ ఉన్న పోస్టు రవాణా కానిస్టేబు­ల్‌ అని చెప్పాలి. మొత్తం 63 పోస్టులకు తుది రా­త పరీక్షకు 747 మంది మహిళలు, 8,256 మంది పురుషులు పోటీలో ఉన్నారు. ఒక్కో పోస్టు­కు సరాసరిన 142 మంది పోటీ పడుతున్నారు. 
  • ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులు 8 ఉండగా.. పోటీలో 1,921 మంది అభ్యర్థులు ఉన్నారు. అంటే ఒక్కో పోస్టుకు 240 మంది పోటీ పడుతున్నారు. కానిస్టేబుల్‌ మెకానిక్‌ 21 పోస్టులకు గాను 1,185 మంది, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో మూడు ఎస్సై పోస్టులకు 933 మంది, 100 డ్రైవర్‌ పోస్టులకు 6,504 మంది పోటీలో ఉన్నారు. 
Published date : 11 Jan 2023 02:55PM

Photo Stories