TSLPRB: ‘పోలీసు’ దరఖాస్తులకు ఆఖరు తేదీ ఇదే
పోలీస్, ఫైర్, ఎస్‌పీఎఫ్, ట్రాన్స్ పోర్టు, అబ్కారీ, జైళ్ల శాఖలోని 17 వేల ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ కు స్పందనగా అభ్యర్థుల నుంచి మే 19 నాటికి 10 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు బోర్డు తెలిపింది. 2018లో నిర్వహించిన ఎం పిక ప్రక్రియలో 6 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఈసారి మహిళా అభ్యర్థుల నుంచి 2.4 లక్షల దరఖాస్తులు వచి్చనట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. దరఖాస్తుల సమర్పణకు మే 20 రాత్రి 10 గంటల దాకా సమయం ఉండటంతో మొత్తం దరఖాస్తులు దాదాపు 11 లక్షలకు చేరువయ్యే అవకాశం ఉందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్–1 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో 1.45 లక్షల దరఖాస్తులు దాఖలైనట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. మే 31 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉండటంతో మరో లక్ష దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చదవండి:
TS Police Jobs: పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు.. మరో శుభవార్త..
TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చదివితే పోలీస్ ఉద్యోగం మీదే..!
TS Police Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు వయోపరిమితి ఇదే..