Police Recruitment Board: ప్రశ్నపత్రంలో తప్పులు లేవు
ప్రశ్నపత్రంలో 13 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న వార్తల్ని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు కొట్టిపారేశారు. రెండు, మూడు రోజుల్లో ప్రాథమిక కీ పేపర్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, ప్రాథమిక కీ విడుదల తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేయాలని, ఒకవేళ తప్పు ప్రశ్నలున్నట్లైతే బోర్డు, నిపుణులు వాటిపై చర్యలు తీసుకుంటామని ఆగస్టు 29న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులెవరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ప్రశ్నలు తప్పుగా వచ్చినా, ఒకవేళ సమాధానాల ఆప్షన్లలో తప్పులు దొర్లినా మార్కులు కలిపేందుకు బోర్డు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నిపుణులు, బోర్డు అధికారులు ధ్రువీకరించకముందే వార్తలు ప్రసారం చేసి అభ్యర్థులను ఆందోళనకు గురిచేయవద్దని సూచించారు. కీ పేపర్‌పై అభ్యంతరాలుంటే బోర్డుకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, వాటిపై బోర్డు చర్యలు చేపడుతుందని తెలిపారు.
చదవండి: