Skip to main content

TSLPRB: కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా.. స్టడీ మెటీరియల్ కోసం చూడండి..

ఆగస్టు 21న జరగాల్సిన కానిస్టేబుల్‌ ఉద్యోగాల(సివిల్‌/తత్సమాన, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్‌ విభాగం) ప్రిలిమినరీ రాత పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నట్లు పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ఆగస్టు 8న ఒక ప్రకటనలో వెల్లడించారు. కొన్ని పాలనా సమస్యల వల్ల పరీక్షను వారంపాటు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
TSLPRB
కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా

28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. అభ్యర్థులు ఈ ఆగస్టు 18 నుంచి హాల్‌టికెట్లను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. 2022 ఏప్రిల్‌ 25న 15,644 సివిల్, వివిధ విభా గాల్లోని కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

కానిస్టేబుల్‌ రాత పరీక్షల‌ - స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్

Published date : 09 Aug 2022 03:04PM

Photo Stories