TSLPRB: యూనిఫాం ఉద్యోగ పరీక్షలకు అండర్‌టేకింగ్ గడువు తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్ : యూనిఫాం ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కోసం గర్భిణులు, బాలింతలు రాతపూర్వక అండర్ టేకింగ్ పత్రాన్ని సమర్పించే గడువు ఫిబ్రవరి 8తో ముగియనుంది.
మహిళా అభ్యర్థుల్లో గర్భిణులు, బాలింతలు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాకుండా.. తుది రాత పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అండర్ టేకింగ్ ఇచ్చిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్
అండర్ టేకింగ్ ఇచ్చేందుకు గతంలో జనవరి 31 వరకు గడువు ఇచ్చారు. దాన్ని మరోమారు పొడిగిస్తూ ఫిబ్రవరి 28 వరకు అవకాశం కల్పించారు. అండర్ టేకింగ్ ఇవ్వనివారు డీజీపీ కార్యాలయంలో ఇన్‌వర్డ్ సెక్షన్‌లో రాతపూర్వకంగా అందించాలని అధికారులు సూచించారు.
Published date : 27 Feb 2023 01:26PM