Skip to main content

TSLPRB: ఎస్సై తుది రాతపరీక్షకు ఇంత మంది హాజరు.. ‘కీ’ కోసం క్లిక్ చేయండి

సాక్షి, హైదరాబాద్‌: యూనిఫాం సర్విసెస్‌ కొలువుల భర్తీలో భాగంగా ఏప్రిల్‌ 8, 9న నిర్వహించిన ఎస్సై తుది రాతపరీక్షలకు 95 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
TSLPRB
ఎస్సై తుది రాతపరీక్షకు ఇంత మంది హాజరు.. ‘కీ’ కోసం క్లిక్ చేయండి

సివిల్‌ ఎస్సై, కమ్యూనికేషన్‌ ఎస్సై, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ ఎస్సై, ఫింగర్‌ప్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులకు మొత్తం 62,342 మంది అభ్యర్థులకు గాను 59,534 మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు హాజరైనట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.

 TS SI Final Exam - 2023 QP with Key - GS Arithmetic & Reasoning

హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌ల్లో కలిపి మొత్తం 81 కేంద్రాల్లో తుది రాత పరీక్షను నిర్వహించినట్టు ఏప్రల్‌ 9న ఓ ప్రకటనలో వెల్లడించారు. ముందస్తు ప్రణాళిక, పోలీస్‌ ఉన్నతాధికారుల పకడ్బందీ ఏర్పాట్లతో పొరపాట్లకు తావులేకుండా పరీక్ష పరీక్ష సజావుగా సాగిందని తెలిపారు. తుది రాత పరీక్షల ప్రిలిమినరీ కీ అతి త్వరలో పోలీస్‌ నియామక మండలి వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.్టట pటb.జీn లో పొందుపరుస్తామని తెలిపారు. 

సెంటర్ల వారీగా అభ్యర్థుల హాజరు 

ప్రాంతం

సెంటర్ల సంఖ్య

మొత్తం అభ్యర్థులు

పరీక్షకు హాజరైన వారు

హైదరాబాద్‌

42

34,400

32,945

కరీంనగర్‌

18

13,555

12,833

వరంగల్‌

21

14,387

13,756

మొత్తం

81

62,342

59,534

Published date : 10 Apr 2023 01:31PM

Photo Stories