రష్యా మొదటి పంచవర్ష ప్రణాళికలో కింద పేర్కొన్న ఏ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు?
1. రష్యా మొదటి పంచవర్ష ప్రణాళికలో కింద పేర్కొన్న ఏ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు?
ఎ) కుటీర పరిశ్రమలు
బి) భారీ మౌలిక పరిశ్రమలు
సి) వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు
డి) విద్యుత్
- View Answer
- సమాధానం: బి
2. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) ముఖ్యమంత్రి
బి) ఆర్థికమంత్రి
సి) ఆర్థికశాఖ కార్యదర్శి
డి) ప్రిన్సిపల్ సెక్రెటరీ
- View Answer
- సమాధానం: ఎ
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికా బోర్డు డిప్యూటీ చైర్మన్ ఎవరు?
ఎ) వై.వి.రెడ్డి
బి) కుటుంబరావు
సి) నిరంజన్ రెడ్డి
డి) వై. రామకృష్ణుడు
- View Answer
- సమాధానం: బి
4. ‘వ్యవసాయ రంగంలోని మిగులు శ్రామికశక్తిని పారిశ్రామిక రంగానికి తరలిస్తే పదేళ్లలో జాతీయాదాయం రెట్టింపు అవుతుంది’ అని పేర్కొన్నవారు?
ఎ) కె.ఎన్. సేన్
బి) జాన్ మత్తయ్య
సి) దలాల్
డి) విశ్వేశ్వరయ్య
- View Answer
- సమాధానం: డి
5. ‘ఎ ప్లాన్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా’ను ఏ విధంగా వ్యవహరిస్తారు?
ఎ) ప్రజా ప్రణాళిక
బి) గాంధీయన్ ప్రణాళిక
సి) బాంబే ప్లాన్
డి) ఆర్థిక ప్రణాళిక
- View Answer
- సమాధానం: సి
6. 1938లో ఏర్పాటు చేసిన జాతీయ ప్రణాళికా కమిటీ అధ్యక్షులు ఎవరు?
ఎ) నెహ్రూ
బి) సుభాష్ చంద్రబోస్
సి) దలాల్
డి) జి.డి. బిర్లా
- View Answer
- సమాధానం: ఎ
7. భారతదేశానికి ప్రణాళికా సంఘం ఏర్పాటు అవసరాన్ని మొదటగా ఎవరు ప్రతిపాదించారు?
ఎ) పి.సి. లోక్‌నాథ్
బి) కె.ఎన్. సేన్
సి) సుభాష్ చంద్రబోస్
డి) మహాత్మా గాంధీ
- View Answer
- సమాధానం: సి
8. వ్యవసాయం, గ్రామీణ, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడానికి రూ. 3000 కోట్లను కేటాయించాలని శ్రీమన్నారాయణ అగర్వాల్ కింది ఏ ప్రణాళికలో ప్రతిపాదించారు?
ఎ) గాంధీయన్ ప్లాన్
బి) పీపుల్స్ ప్లాన్
సి) ఆర్థిక ప్రణాళిక
డి) అభివృద్ధి ప్రణాళిక
- View Answer
- సమాధానం: ఎ
9. రెండో ప్రపంచ యుద్ధం వల్ల నష్టపోయిన దేశానికి అభివృద్ధి వ్యూహాలను రూపొందించడానికి ప్రణాళికా డిపార్టమెంట్ను ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?
ఎ) ఎం.ఎన్. రాయ్
బి) కె.సి. నియోగి
సి) దలాల్
డి) జయప్రకాశ్ నారాయణ్
- View Answer
- సమాధానం: సి
10. 1948లో మొదటిసారిగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానం, జాతీయ స్థాయి ప్రణాళికలను ప్రవేశ పెట్టిన దేశం?
ఎ) ఇండియా
బి) దక్షిణాఫ్రికా
సి) ఫ్రాన్స్
డి) రష్యా
- View Answer
- సమాధానం: సి
11. తెలంగాణ రాష్ట్రంలో ప్రణాళికా బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 2014 ఆగస్టు 15
బి) 2014 డిసెంబర్ 15
సి) 2015 జనవరి 1
డి) 2015 డిసెంబర్ 15
- View Answer
- సమాధానం: బి
12.కింద పేర్కొన్న ఏ ప్లాన్ పరోక్షంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించింది?
ఎ) బాంబే ప్లాన్
బి) పీపుల్స్ ప్లాన్
సి) గాంధీయన్ ప్లాన్
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: ఎ
13. బ్రిటిష్ ప్రభుత్వం 1946లో తాత్కాలిక సలహా పూర్వక ప్రణాళికా బోర్డును ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది?
ఎ) ఎం.ఎన్.రాయ్
బి) దలాల్
సి) వి.కె. ఆర్.వి.రావ్
డి) కె.సి. నియోగి
- View Answer
- సమాధానం: డి
14. పదేళ్ల కాలంలో ప్రణాళికాబద్ధంగా వ్యయం చేస్తే.. భారత్ అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నవారు?
ఎ) కె.సి.నియోగి
బి) ఎం.ఎన్.రాయ్
సి) నెహ్రూ
డి) మహాత్మా గాంధీ
- View Answer
- సమాధానం:బి
15.బాంబే ప్రణాళికను వ్యతిరేకిస్తూ గాంధేయ ప్రణాళికను ప్రతిపాదించినవారు?
ఎ) శ్రీమన్నారాయణ అగర్వాల్
బి) మహాత్మా గాంధీ
సి) నెహ్రూ
డి) ఆచార్య వినోబా భావే
- View Answer
- సమాధానం: ఎ
16. సర్వోదయ ప్రణాళికను ప్రతిపాదించింది?
ఎ) మొరార్జీ దేశాయ్
బి) జయప్రకాష్ నారాయణ్
సి) వినోబా భావే
డి) ఎం.ఎన్. రాయ్
- View Answer
- సమాధానం: బి
17. 1948లో భారతదేశానికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు, ప్రణాళికా సంఘం ఉండాలని సిఫారసు చేసింది?
ఎ) జాతీయ ప్రణాళికా కమిటీ
బి) ప్రణాళికా డిపార్టమెంట్
సి) షణ్ముగ శెట్టి
డి) ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్
- View Answer
- సమాధానం: ఎ
18. 1950 ఫిబ్రవరి 15న ప్రణాళికా సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నాటి ఆర్థిక మంత్రి?
ఎ) ఎన్.జి. రంగా
బి) షణ్ముగశెట్టి
సి) సంజీవరెడ్డి
డి) ఎన్.డి. తివారీ
- View Answer
- సమాధానం:బి
19. ఎం.ఎన్.రాయ్ ప్రజా ప్రణాళికను ఏ సంస్థ తరఫున విడుదల చేశారు?
ఎ) ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ
బి) ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్
సి) లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: బి
20. ఫ్రాన్స్ మొదటగా సూచనాత్మక ప్రణాళికను ఎప్పుడు ప్రవేశపెట్టింది?
ఎ) 1940
బి) 1942
సి) 1948
డి) 1952
- View Answer
- సమాధానం: సి
21. భారత్‌లో మొదటి పంచవర్ష ప్రణాళికా కాలం?
ఎ) 1951 ఏప్రిల్ 1 - 1956 మార్చి 31
బి) 1952 ఏప్రిల్ 1 - 1957 మార్చి 31
సి) 1953 ఏప్రిల్ 1 - 1958 మార్చి 31
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
22. సింద్రి ఎరువుల కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) బిహార్
బి) మహారాష్ట్ర
సి) ఉత్తరప్రదేశ్
డి) జార్ఖండ్
- View Answer
- సమాధానం: డి
23. మొదటి పంచవర్ష ప్రణాళికా సమయంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు?
ఎ) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
బి) గుల్జారీలాల్ నందా
సి) నెహ్రూ
డి) షణ్ముగశెట్టి
- View Answer
- సమాధానం: బి
24. పిగ్మి ప్రణాళికకు కాలపరిమితిని ఎంతగా పేర్కొనవచ్చు?
ఎ) 12 నెలల కంటే తక్కువ
బి) 24 నెలలు
సి) 36 నెలల కంటే ఎక్కువ
డి) పదేళ్లు
- View Answer
- సమాధానం: ఎ
25. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌ను మొదటగా ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) తమిళనాడు
సి) పంజాబ్
డి) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: సి
26. బాక్రానంగల్, హీరాకుడ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎన్నో ప్రణాళికలో ప్రారంభించారు?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
- View Answer
- సమాధానం: ఎ
27. ‘హిందూస్థాన్ మెషిన్ టూల్స్’ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
ఎ) తమిళనాడు
బి) కర్ణాటక
సి) కేరళ
డి) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: బి
28. ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1948
బి) 1949
సి) 1951
డి) 1952
- View Answer
- సమాధానం: డి
29. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1954 డిసెంబర్
బి) 1955 డిసెంబర్
సి) 1956 డిసెంబర్
డి) 1957 జనవరి
- View Answer
- సమాధానం: బి
30. నిత్యావసర వస్తువుల చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు?
ఎ) 1952
బి) 1953
సి) 1955
డి) 1957
- View Answer
- సమాధానం: సి
31. మొదటి ప్రణాళికా కాలంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) కోల్‌కతా
బి) విశాఖపట్నం
సి) కొచ్చిన్
డి) త్రివేండ్రం
- View Answer
- సమాధానం: బి
32.హిందుస్థాన్ కేబుల్ కంపెనీని ఏర్పాటు చేసిన దుర్గాపూర్ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) పశ్చిమ బెంగాల్
బి) జార్ఖండ్
సి) బిహార్
డి) కర్ణాటక
- View Answer
- సమాధానం: ఎ
33. మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్‌ను ఎన్నో ప్రణాళికా కాలంలో ప్రారంభించారు?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
- View Answer
- సమాధానం: ఎ
34. ‘భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి’, ‘ప్రణాళికల రూపకర’తగా ఎవరిని పేర్కొనవచ్చు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
సి) సుభాష్ చంద్రబోస్
డి) మహాత్మా గాంధీ
- View Answer
- సమాధానం: ఎ
35. ఆర్థిక వనరులను ఉపయోగిస్తూ నిర్దిష్ట కాల పరిమితిలో లక్ష్యాలను సాధించే ప్రణాళికను ఏమంటారు?
ఎ) భౌతిక ప్రణాళిక
బి) కేంద్రీకృత ప్రణాళిక
సి) విత్త ప్రణాళిక
డి) వికేంద్రీకృత ప్రణాళిక
- View Answer
- సమాధానం: సి
36. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను సమర్థించిన ఆర్థికవేత్త ఎవరు?
ఎ) ఆడమ్‌స్మిత్
బి) జె.ఎం. కీన్స
సి) మాల్దస్
డి) జె.బి. సే
- View Answer
- సమాధానం: బి
37. ఒడిశాలో రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారు?
ఎ) రష్యా
బి) అమెరికా
సి) దక్షిణ కొరియా
డి) పశ్చిమ జర్మనీ
- View Answer
- సమాధానం: డి
38. ఛత్తీస్‌గఢ్‌లో బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారు?
ఎ) రష్యా
బి) బ్రిటన్
సి) పశ్చిమ జర్మనీ
డి) అమెరికా
- View Answer
- సమాధానం: ఎ
39. ‘చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1950
బి) 1952
సి) 1954
డి) 1955
- View Answer
- సమాధానం: సి
40. నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) తమిళనాడు
బి) కేరళ
సి) కర్ణాటక
డి) బిహార్
- View Answer
- సమాధానం: ఎ
41. రెండో పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు?
ఎ) డి.ఆర్. గాడ్గిల్
బి) వి.టి. కృష్ణమాచారి
సి) జవహర్లాల్ నెహ్రూ
డి) మహలనోబిస్
- View Answer
- సమాధానం: బి
42. రాంచీలో హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1960
బి) 1961
సి) 1962
డి) 1963
- View Answer
- సమాధానం: ఎ
43.రెండో ప్రణాళిక వైఫల్యానికి కింది వాటిలో దేన్ని కారణంగా పేర్కొనవచ్చు?
ఎ) పారిశ్రామిక రంగ వృద్ధి క్షీణత
బి) విదేశీ కరెన్సీ నిల్వ అధికమవడం
సి) వ్యవసాయ రంగంలో వృద్ధి క్షీణించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
44. రెండో ప్రణాళికా కాలంలో ఎగుమతులు తగ్గి విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గడానికి ప్రధాన కారణం?
ఎ) ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యం
బి) సూయజ్ కాలువ మూసివేత
సి) చైనాతో యుద్ధం
డి) పాకిస్తాన్‌తో యుద్ధం
- View Answer
- సమాధానం: బి
45.ఆదాయ పంపిణీ అసమానతలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షులు?
ఎ) మహలనోబిస్
బి) జి.ఎం. త్రివేది
సి) గుల్జారీ లాల్ నందా
డి) అశోక్ మెహతా
- View Answer
- సమాధానం: ఎ
46. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారు?
ఎ) బ్రిటన్
బి) రష్యా
సి) పశ్చిమ జర్మనీ
డి) తూర్పు జర్మనీ
- View Answer
- సమాధానం: ఎ
47. ‘కేంద్ర గిడ్డంగుల సంస్థ’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1955
బి) 1956
సి) 1957
డి) 1958
- View Answer
- సమాధానం: సి
48.‘ఎయిర్ ఇండియా’ ఏర్పాటైన సంవత్సరం?
ఎ) 1952
బి) 1953
సి) 1954
డి) 1955
- View Answer
- సమాధానం: బి
49. జాతీయ సహకార వ్యవసాయ మార్కెటింగ్ ఫెడరేషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1958
బి) 1959
సి) 1961
డి) 1963
- View Answer
- సమాధానం:ఎ
50. మూడో పంచవర్ష ప్రణాళిక రూపకర్త?
ఎ) మహలనోబిస్
బి) గాడ్గిల్
సి) అశోక్ మెహతా
డి) గున్నార్ మిర్ధల్
- View Answer
- సమాధానం: సి
51. సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని 1960-61లో దేశంలో మొదటగా ఎన్ని జిల్లాల్లో ప్రవేశ పెట్టారు?
ఎ) 5
బి) 7
సి) 10
డి) 12
- View Answer
- సమాధానం: బి
52. ‘స్వావలంబన, స్వయం సమృద్ధి’ ఎన్నో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
- View Answer
- సమాధానం: సి