ఆర్థికాభివృద్ధి - వ్యూహాలు
1. కొనుగోలు శక్తి సమానత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారెవరు?
ఎ) షుంపీటర్
బి) గుస్తావ్కాసల్
సి) మిస్సెస్ జోన్రాబిన్సన్
డి) మిర్దాల్
- View Answer
- సమాధానం: బి
2. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత పక్కపక్కనే ఉంటాయని ఎన్నో ప్రణాళిక డాక్యుమెంట్లో పేర్కొన్నారు?
ఎ) 3
బి) 5
సి) 8
డి) 10
- View Answer
- సమాధానం: ఎ
3. మార్కిషియన్ నిరుద్యోగిత (బహిరంగ నిరుద్యోగిత) అనే పదాన్ని ఉపయోగించినవారెవరు?
ఎ) లూయిస్
బి) అమర్త్యసేన్
సి) మాల్థస్
డి) మిస్సెస్ జోన్ రాబిన్సన్
- View Answer
- సమాధానం: డి
4. వృద్ధి - సంక్షేమం మధ్య ఉన్న సంబంధం విషయంలో కింది ఏ అంశాన్ని పరిమితిగా పేర్కొనలేం?
ఎ) అధిక ధరలు
బి) జనాభా పెరుగుదల
సి) అధిక శ్రామిక పనిగంటలు
డి) తక్కువ అనుత్పాదక వ్యయం
- View Answer
- సమాధానం: డి
5. శ్రామిక దోపిడీ లేదా మిగులు విలువ రేటును ఏవిధంగా కనుగొనవచ్చు?
ఎ) మిగులు విలువ ÷ వేతనాలు (చర మూలధనం)
బి) మిగులు విలువ ÷ యంత్రాలపై వ్యయం (స్థిర మూలధనం)
సి) అవకాశ వ్యయం ÷ ద్రవ్య వ్యయం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
6. మార్క్స్ ఆర్థికాభివృద్ధి సిద్ధాంతాన్ని ఏ విధంగా చర్చించవచ్చు?
ఎ) మిగులు విలువ సిద్ధాంతం
బి) మూలధన కల్పన
సి) మూలధన సంక్షోభం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7. రోస్టోవ్ అభిప్రాయంలో జాతీయాదాయంలో నికర పెట్టుబడి 10 శాతానికి మించి ఉండే దశ దేన్ని సూచిస్తుంది?
ఎ) సాంప్రదాయ సమాజం
బి) పరిపక్వ దశకు గమనం
సి) ప్లవన దశ
డి) సామూహిక వినియోగం
- View Answer
- సమాధానం: బి
8. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ నరకానికి దారి తీస్తాడు అని ఎవరు పేర్కొన్నారు?
ఎ) రోస్టోవ్
బి) మిర్దాల్
సి) మాల్థస్
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
9. ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్’ ఆర్థికాభివృద్ధి సూచీ నిర్మాణంలో కింద పేర్కొన్న ఏ సూచీని పరిగణనలోకి తీసుకోలేదు?
ఎ) విద్యాస్థాయి
బి) సాంకేతిక విజ్ఞానం
సి) ఆరోగ్య వృద్ధి
డి) తలసరి స్థూల జాతీయోత్పత్తి
- View Answer
- సమాధానం: బి
10. గినీ గుణకం విలువ ‘ఒకటి’ కావడం దేన్ని సూచిస్తుంది?
ఎ) సంపూర్ణ అసమానత్వం
బి) సంపూర్ణ సమానత్వం
సి) సంపద సమానత్వం
డి) తక్కువ నిరుద్యోగం
- View Answer
- సమాధానం: ఎ
11. స్థూల దేశీయ పొదుపులో అధిక వాటాను కలిగిన రంగం ఏది?
ఎ) ప్రభుత్వ రంగం
బి) కార్పొరేట్ రంగం
సి) గృహ రంగం
డి) విదేశీ వాణిజ్యం
- View Answer
- సమాధానం: సి
12. హారడ్-డోమార్ ఆర్థికాభివృద్ధి నమూనాలో మూలధన కల్పన కింది ఏ దశను కలిగి ఉంటుంది?
ఎ) నిజ పొదుపు స్థాయిలో పెరుగుదల
బి) పరపతి సంస్థల ద్వారా పొదుపు సమీకరించడం
సి) పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా మార్చడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
13. ప్రచ్ఛన్న నిరుద్యోగితపై అంచనాలను రూపొందించినవారు?
ఎ) శకుంతల మెహ్రా
బి) అమర్త్యసేన్
సి) మార్షల్
డి) జె.బి. సే
- View Answer
- సమాధానం: ఎ
14. మార్కెట్ వ్యవస్థ ద్వారా అభివృద్ధి చెందిన దేశాలేవి?
ఎ) మొదటి ప్రపంచ దేశాలు
బి) రెండో ప్రపంచ దేశాలు
సి) మూడో ప్రపంచ దేశాలు
డి) నాలుగో ప్రపంచ దేశాలు
- View Answer
- సమాధానం: ఎ
15. ‘గ్రామీణ ప్రాంతాల్లోని ప్రచ్ఛన్న నిరుద్యోగులను ఇతర రంగాలకు తరలిస్తే జాతీయాదాయం పెరుగుతుంది’ అని పేర్కొన్నది?
ఎ) మాల్థస్
బి) రాగ్నార్ నర్క్స్
సి) జె.బి. సే
డి) ఆడమ్ స్మిత్
- View Answer
- సమాధానం: బి
16. వ్యవస్థాపకుల కొరత వల్ల కూడా పెట్టుబడి స్థాయి తక్కువగా ఉంటుందని పేర్కొన్నవారెవరు?
ఎ) షుంపీటర్
బి) రాగ్నార్ నర్క్స్
సి) లెబన్ స్టీన్
డి) డోమార్
- View Answer
- సమాధానం: ఎ
17. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిదారీ వర్గం, కార్మిక వర్గం అనే రెండు వర్గాలుంటాయని పేర్కొన్నవారెవరు?
ఎ) లూయిస్
బి) నెల్సన్
సి) కార్ల్ మార్క్స్
డి) హారడ్
- View Answer
- సమాధానం: సి
18. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో నూతన యంత్రాలు ప్రవేశ పెట్టడం వల్ల పెరిగే నిరుద్యోగులను కార్ల్ మార్క్స్ ఏవిధంగా పిలిచారు?
ఎ) ఇండస్ట్రియల్ రిజర్వడ్ ఆర్మీ
బి) మిగులు శ్రామికులు
సి) రెండు వర్గాల మధ్య పోరాటం
డి) చర మూలధనం
- View Answer
- సమాధానం: ఎ
19. బ్రిటన్ సామూహిక వినియోగ దశను ఏ సంవత్సరంలో చేరిందని అంచనా?
ఎ) 1928
బి) 1929
సి) 1930
డి) 1931
- View Answer
- సమాధానం: సి