Skip to main content

అంత్యోదయ యోజనను 1977 అక్టోబర్ 22న మొదటగా ప్రారంభించిన రాష్ర్టం?

భారత్ - గ్రామీణాభివృద్ధి
భారత ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి సాధనలో గ్రామీణాభివృద్ధి పాత్ర ప్రధానమైంది. ప్రణాళికా రచయితలు వివిధ ప్రణాళికల్లో వనరుల కేటాయింపులో గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. భారత్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. మనదేశ స్థూల దేశీయోత్పత్తికి వ్యవసాయ రంగం తన వాటాగా 1/6 వ వంతు అందిస్తోంది. 1961 గణాంకాల ప్రకారం గ్రామీణ జనాభా 360.3 మిలియన్లు కాగా 2011లో 833.1 మిలియన్లకు పెరిగింది. గ్రామీణ జనాభా దశాబ్ద వృద్ధి 2011 గణాంకాల ప్రకారం 12.2 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం గ్రామీణాభివృద్ధి లక్ష్యం. సమాజంలోని పేద వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధి గ్రామీణాభివృద్ధిలో భాగంగా ఉంటాయి. గ్రామీణ రంగ అభివృద్ధికి సంబంధించి విధానాల రూపకల్పన, నియంత్రణ, చట్టాలను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది. వ్యవసాయం, హాండీక్రాఫ్ట్, ఫిషరీస్, పౌల్ట్రీ, డైరీలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన కార్యకలాపాలు.

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రామీణాభివృద్ధి డిపార్‌‌టమెంట్ గ్రామీణ ప్రాంతాల్లో అమలయ్యే ముఖ్య పథకాలను పర్యవేక్షిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు ఉద్దేశించిన పథకాల్లో కొన్ని పథకాల ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపనా సౌకర్యాలను మెరుగుపరచడం. రోడ్ల నిర్మాణం, గృహ నిర్మాణం, హౌసింగ్, హాబిటేషన్ డెవలప్‌మెంట్, బేసిక్ సర్వీస్‌లు కొన్ని గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల లక్ష్యంగా ఉంటాయి. 2019 మార్చి నాటికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పది మిలియన్ కుటుంబాలకు గృహ నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

గ్రామీణాభివృద్ధి లక్ష్యాలు:
  1. ఆర్థిక, సాంఘిక అవస్థాపనలకు సంబంధించి వస్తు, సేవలను అందించడం.
  2. ప్రతి గ్రామీణ కుటుంబ ఆదాయ స్థాయి పెంపు.
  3. గ్రామీణ ప్రాంతాల్లో అదనపు ఉపాధి అవకాశాల కల్పన
  4. గ్రామీణ ప్రజల సామర్థ్యం పెంపు ద్వారా ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకునే మార్పులకనుగుణంగా గ్రామీణ ఆర్థిక కార్యకలాపాల మెరుగుదల.
  5. గ్రామీణ ప్రజలకు వివిధ సేవల అందుబాటు.
  6. గ్రామీణ ప్రజల తలసరి కొనుగోలు శక్తి పెంపుతోపాటు మెరుగైన విద్య, ఉత్పాదక ఉపాధి కల్పన ద్వారా కొనుగోలు శక్తి పంపిణీని మెరుగుపరచడం.
  7. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పాదకత పెంపు ద్వారా గ్రామీణ పేదరికం తగ్గింపు.
  8. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రణాళిక, అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యం పెంపు.
  9. సమాజంలోని అందరికీ సమాన అవకాశాలు కల్పించడం.

గ్రామీణ పేదలు ముఖ్యంగా చిన్న, ఉపాంత రైతులు, కౌలుదారులు, భూమిలేని పేదవారి ఆర్థిక, సాంఘిక స్థితిగతులను మెరుగుపరచే వ్యూహమే గ్రామీణాభివృద్ధిగా ‘అగర్వాల్ (1989)’ నిర్వచించారు. అభివృద్ధ్ది వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాల ప్రజలకు విస్తరించడం ద్వారా కొన్ని ప్రత్యేక వర్గాల ప్రజల ఆర్థిక, సాంఘిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం గ్రామీణాభివృద్ధి అనే వ్యూహాన్ని రూపొందించారని ‘ప్రపంచ బ్యాంక్’ అభిప్రాయపడింది. గ్రామీణాభివృద్ధి అంటే గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక వనరులను అభిలషణీయంగా వినియోగించుకోవడం ద్వారా ఒక ప్రాంతం, ప్రజల అభివృద్ధిగా ‘వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి’పై ఏర్పాటైన జాతీయ కమీషన్ అభిప్రాయపడింది. గ్రామీణ పేద ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం గ్రామీణాభివృద్ధి ముఖ్య లక్ష్యంగా పేర్కొనవచ్చు. అన్ని విధాలైన అభివృద్ధి కార్యకలాపాల్లో గ్రామీణ ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించినప్పుడు గ్రామీణాభివృద్ధి లక్ష్యాలు నెరవేరుతాయి.
  1. ఆర్థిక వృద్ధి సాధనలో ప్రజలందరికీ కనీస అవసరాలైన ఆహారం, గృహం, వస్త్రాలతో పాటు ఆరోగ్య సౌకర్యాలు, భద్రత కల్పించడం
  2. ఆత్మగౌరవం
  3. స్వేచ్ఛ అనేవి గ్రామీణాభివృద్ధికి సంబంధించి కీలక అంశాలుగా పేర్కొనవచ్చు.

భారత్‌లో గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా కింది ప్రయోజనాలను ఆశించవచ్చు.
  1. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక మార్పు ద్వారా అనేక గ్రామీణ సమస్యల నివారణ.
  2. గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే వనరుల వినియోగం
  3. గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపనా సౌకర్యాల పెరుగుదల.
  4. జాతీయోత్పత్తి వృద్ధి వేగవంతం ద్వారా జాతీయ, తలసరి ఆదాయాల వృద్ధి.
  5. గ్రామీణ ప్రాంతాల్లో ఇంధనం, జౌఛీఛ్ఛీట లభ్యత పెంపు.
  6. దేశీయ వాణిజ్యం, అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి.
  7. మూలధన కల్పనలో పెరుగుదల.
  8. రాజకీయ సుస్థిరత సాధన.
  9. వ్యవసాయ రంగంలో 2 శాతం వృద్ధి ఇతర రంగాలలో 8 శాతం వృద్ధికి కారణమవుతుంది.

గ్రామీణాభివృద్ధికి సంబంధించి ముఖ్య పథకాలు..
  1. గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలు
  2. సామాజిక అభివృద్ధి కార్యక్రమం
  3. ప్యాకేజి అప్రోచ్ (IADP, IAAP, HYVP)
  4. ఏరియా అప్రోచ్ (DPAP, CAD)
  5. టార్గెట్ అప్రోచ్ (SFDA, MFALDA)
  6. స్వయం ఉపాధి పథకాలు (IRDP, TRYSEM, DWACRA స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన)
  7. వేతన ఉపాధి పథకాలు (NREP, RLEGP, JRY, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం)
  8. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన, పి.ఎం. గ్రామీణాభివృద్ధి ఫెలోస్ పథకం, సర్వశిక్షా అభియాన్.


మాదిరి ప్రశ్నలు :

1. అంత్యోదయ యోజనను 1977 అక్టోబర్ 22న మొదటగా ప్రారంభించిన రాష్ర్టం?
1) రాజస్థాన్
2) ఉత్తరప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) గుజరాత్

Published date : 29 Dec 2018 06:57PM

Photo Stories