Skip to main content

ప్రపంచ భౌగోళిక అంశాలు

  • ‘ఎద్దు అడుగు సరస్సు’ అనే భూస్వరూపం దేని క్రమక్షయం వల్ల ఏర్పడింది?
    నదీ క్రమక్షయ భూస్వరూపం
  • అంతర్భూజల క్రమక్షయ భూస్వరూపాలు ప్రధానంగా ఎక్కడ కన్పిస్తాయి?
    ‘సున్నపురాయి’ అధికంగా ఉన్న ప్రాంతాల్లో
  • 24° రేఖాంశం ఏ రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దు రేఖగా ఉంది?
    జర్మనీ- పోలెండ్
  • ఆస్ట్రేలియా, టాస్మానియాను వేరుచేస్తున్న జలసంధి
    బాస్ జలసంధి
  • కాఫీ బౌల్ ఆఫ్ ద వరల్డ్’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
    బ్రెజిల్
  • ‘ఉత్తర ప్రాంతపు వెనీస్’గా ప్రసిద్ధి చెందిన ప్రాంతం
    స్టాక్‌హోమ్
  • అంతర్జాతీయ నదిగా దేన్ని పిలుస్తారు?
    డాన్యూబ్ నది (8 దేశాల గుండా ప్రవహిస్తుంది)
  • ‘మధ్యధరా సముద్రపు తాళపు చెవి’ అని దేనికి పేరు?
    జిబ్రాల్టర్ జల సంధి
  • కలహారి ఎడారి ఏ ఖండంలో విస్తరించి ఉంది?
    ఆఫ్రికా ఖండం
  • ‘కాబూ’ అనే ఆదిమ తెగ ఏ ప్రాంతంలో నివసిస్తుంది?
    సుమత్రా దీవులు
  • ‘గ్జీరోఫైట్స్’ అంటే ఏమిటి?
    ఎడారుల్లో పెరిగే మొక్కలను గ్జీరోఫైట్స్ అంటారు.
  • ఆఫ్రికా ఖండంలోని జైరేలోని ‘కటంగా’ జిల్లా ఏ ఖనిజానికి ప్రసిద్ధి చెందింది?
    రాగి నిక్షేపాలు
  • దక్షిణ అమెరికాలో ఉన్న ‘పంపాలు’ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి?
    పెటగోనియా (అర్జెంటీనా)
  • టైగా మండలంలో పెరిగే అరణ్యాలను ఏమని పిలుస్తారు?
    శృంగాకార అరణ్యాలు
  • ‘ప్యూర్టోరికో’ అగాథం ఏ మహాసముద్రంలో ఉంది?
    అట్లాంటిక్ మహాసముద్రం
  • సముద్ర భూ తలాల్లోని పొడవైన, ఎత్తై భూస్వరూపాలను ఏమని పిలుస్తారు?
    రిడ్జ్
  • సముద్రలోతును కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు?
    పాథోమీటర్
  • ఒక పోటుకి, మరో పోటుకి మధ్య కాలవ్యవధి ఎంత?
    12 గంటలా 26 నిమిషాలు
  • బెంగుల్యా శీతల ప్రవాహం ఏ మహాసముద్రంలో ఒక భాగం?
    అట్లాంటిక్ మహాసముద్రం
  • ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆఫ్రికా పగులు లోయ గుండా ప్రవహించే నది?
    నైలు నది
  • బ్లాకో ఫారెస్ట్ ఖండ పర్వతాలు ఏ దేశంలో విస్తరించి ఉన్నాయి?
    జర్మనీ
  • పవన క్రమక్షయం వల్ల ఏర్పడిన మైదానాలను ఏమని పిలుస్తారు?
    పెడీ ప్లెయిన్
  • ‘పక్షిపాద’ డెల్టా ఏ నది భూస్వరూపం?
    మిసిసిపి నది
  • కాలీఫ్లవర్ లేదా గుమ్మడి ఆకారంలో ఉండే మేఘాలు ఏవి?
    కుమ్యులస్ మేఘాలు
  • ఘన పదార్థం ద్రవ రూపంలోకి మారకుండా నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఏమని పిలుస్తారు?
    ఉత్పతనం
  • ద్రవాల సాంద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది?
    హైడ్రోమీటర్
  • కృత్రిమ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ఆవరణం ఏది?
    ఎక్సో ఆవరణం
  • శిలాభస్మం, స్కోరియా, ప్యూమిస్, లాపిలి మొదలైనవి కలసి ఘనీభవించగా ఏర్పడిన శిలను ఏమని పిలుస్తారు?
    ఎగ్లామరేట్
  • 0° రేఖాంశం వద్ద సాయంత్రం 5 గంటలా 45 నిమిషాలు అయితే భారతదేశంలో ఎంత సమయం అవుతుంది?
    రాత్రి 11 గంటలా 15 నిమిషాలు
  • దక్షిణార్ధగోళంలో పగటి సమయం తక్కువగా ఉండే రోజు ఏది?
    జూన్ 21
  • సౌర బాంధవులు అని వేటిని పిలుస్తారు?
    తోకచుక్కలు
  • ఒక పార్సెక్ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం?
    3.26 కాంతి సంవత్సరాలు
  • భూమి ఉపరితలం నుంచి లోపలికి పోయేకొద్దీ ప్రతి ఎన్ని మీటర్లకు 1°C ఉష్ణోగ్రత పెరుగుతుంది?
    32 మీటర్లు
  • భారతదేశపు దక్షిణ చివరి కొన అయిన ‘పిగ్మోలియన్ పాయింట్’ ఏ దీవుల్లో ఉంది?
    గ్రేట్ నికోబార్
  • అంజీ దీవి ఏ తీర ప్రాంతంలో ఉంది?
    గోవా తీరం
  • ‘ఫన్నా’ వజ్రపు గనులు ఏ పీఠ భూమిలో ఉన్నాయి?
    భాగల్‌ఖండో పీఠభూమి
  • అరుణాచల్‌ప్రదేశ్‌లోని ‘తేజ్‌పూర్’ను టిబెట్‌లోని ‘తవాంగ్’తో కలిపే కనుమ ఏది?
    బొమ్మిడిలా
  • అసోంలోని రుతుపవన ఆరంభ జల్లులను ఏమని పిలుస్తారు?
    నార్వెస్టర్స్
  • ఎబోని, మహాగని వృక్షాలు ఏ రకపు అరణ్యాలకు సంబంధించినవి?
    ఉష్ణమండల సతత హరితారణ్యాలు
  • ‘సెంటర్ ఫర్ సోషల్ ఫారిస్ట్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ పరిశోధన కేంద్రం ఎక్కడుంది?
    అలహాబాద్
  • భారతదేశంలో ‘ఆల్ఫైన్’ జాతి అడవులు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి?
    హిమాద్రి పర్వతాలు
  • ‘రంగన్ తిట్టూ’ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
    కర్ణాటక
  • పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన మృత్తికలు ఏవి?
    పర్వతీయ మృత్తికలు
  • బంగ్లాదేశ్‌లో ‘జమున’ నదిగా ఏ నదిని పిలుస్తారు?
    బ్రహ్మపుత్ర నది
  • ‘నేత్రావతి’ అని ఏ నదిని పిలుస్తారు?
    బెట్వా నది
  • అమర్‌కంటక్ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
    నర్మదా నది
  • సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు?
    నర్మదా నది
  • భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని ‘సరోవరీయ రాష్ట్రం’ అని పిలుస్తారు?
    జమ్మూ కాశ్మీర్
  • ఫరక్కా ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
    హుగ్లీ నది
  • నరోరా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?
    ఉత్తరప్రదేశ్
  • భారతదేశంలో మొదటిసారి జల విద్యుత్ సరఫరా చేసిన ప్రాంతం?
    డార్జిలింగ్
  • భారతదేశంలో రబ్బరును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
    కేరళ
  • భారతదేశంలో జనుమును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
    పశ్చిమ బెంగాల్
  • భారతదేశంలో అతిపెద్ద ఇనుప గని అయిన ‘బైలదిల్ల’ ఏ రాష్ట్రంలో ఉంది?
    ఛత్తీస్‌గఢ్
  • కోలార్, హట్టి గనులు ఏ ఖనిజాలకు ప్రసిద్ధి?
    బంగారం
  • రుద్రసాగర్ చమురు కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
    అసోం
  • ఏ నదీ పరివాహక ప్రాంతంలో జనుము వస్త్ర పరిశ్రమలు కేంద్రీకృతం అయ్యాయి?
    హుగ్లీ నది
  • ఒడిశాలోని రూర్కెలా ఇనుము, ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో స్థాపించారు?
    పశ్చిమ జర్మనీ
  • రైల్వే కోచ్‌లను తయారుచేసే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?
    పెరంబూర్ (తమిళనాడు)
  • తూర్పుమధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
    హాజీపూర్ (బిహార్)
  • న్యూ మంగళూరు ఓడరేవు ఏ నది ఒడ్డున ఉంది?
    గురుపూర్ నది
  • సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానా శ్రయం ఎక్కడ ఉంది?
    అహ్మదాబాద్ (గుజరాత్)
  • 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం
    పంజాబ్
  • 2011 జనాభా లెక్కల ప్రకారం పురుష అక్షరాస్యత రేటు ఎంత?
    80.9 శాతం
  • 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ స్త్రీ, పురుష నిష్పత్తిగల రాష్ట్రం ఏది?
    హర్యానా (879)
  • భారతదేశంలో తోడాలు గిరిజన తెగ ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు?
    నీలగిరి ప్రాంతం (తమిళనాడు)
  • తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది?
    మహారాష్ట్ర, కర్ణాటక
  • అనంతగిరి కొండలు తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి?
    రంగారెడ్డి
  • తెలంగాణ రాష్ట్రంలో అల్ప వర్షపాతం సంభవించే జిల్లా ఏది?
    మహబూబ్‌నగర్
  • తెలంగాణ రాష్ట్రంలో ఒండ్రు నేలలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి?
    20 శాతం
  • తెలంగాణ రాష్ట్రంలో అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాల్లో విస్తరించి ఉంది?
    నల్లగొండ, మహబూబ్‌నగర్
  • మూసీ నది కృష్ణా నదిలో ఎక్కడ కలుస్తుంది?
    వాడపల్లి (నల్లగొండ జిల్లా)
  • తెలంగాణ రాష్ట్రంలో ‘మేడిగడ్డ’ ఎత్తిపోతల పథకాన్ని ఏ నదిపై నిర్మించనున్నారు?
    గోదావరి
  • మహబూబ్‌నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టల్లో జన్మించే నది ఏది?
    డిండి నది
  • దక్షిణ తెలంగాణ వ్యవసాయ మండలం ప్రధాన కేంద్రం ఏది?
    పాలెం
  • తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సాగు విస్తీర్ణంలో, ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
    కరీంనగర్
  • నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది?
    మహబూబ్‌నగర్
  • షాపుర్ జీ పల్లోంజీ బయోటెక్ పార్క్ ఎక్కడ ఉంది?
    తుర్కపల్లి గ్రామం (రంగారెడ్డి జిల్లా)
  • సింగూర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏ నదిపై నిర్మించారు?
    మంజీరా నదిపై
  • 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జన సాంద్రత ఎంత?
    307
  • కింది వాటిలో ‘రూఫ్ ఆఫ్ సౌత్’ అని దేన్ని పిలుస్తారు?
    కర్ణాటక
  • కైమూర్ పర్వత శ్రేణి ఏ పర్వతాల్లో విస్తరించి ఉంది?
    వింధ్య పర్వతాలు
  • ‘ధువన్ ధార’ జలపాతం ఏ పర్వత శ్రేణిలో ఉంది?
    సాత్పురా
  • బోర్‌ఘాట్ కనుమ ఏ రెండు నగరాలను కలుపుతుంది?
    ముంబాయి-నాసిక్
  • జీవవైవిధ్య ప్రాంతమైన సైలంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది?
    కేరళ
  • ఏ మైదానం బసాల్ట్ నేలలకు ప్రసిద్ధి -
    కొంకణ్ మైదానం
  • ఏ తీరంలో వృష్ణ జాలాలు అధికంగా ఉన్నాయి?
    మలబార్ తీరం
  • చిలుక సరస్సు ఏ తీరంలో ఉంది?
    ఉత్కళ తీరం
  • దేన్ని ‘కాంతితీర మైదానం’ అని పిలుస్తారు?
    వంగతీరం
  • దక్షిణ భారతదేశంలో అతి ఎత్తై శిఖరం -
    అనైముడి
Published date : 11 Mar 2016 02:55PM

Photo Stories