భారతదేశ తీర మైదానాలు - దీవులు
1. 8 డిగ్రీల చానల్ కింది వాటిలో ఏ దీవులను విడదీస్తుంది?
ఎ) లక్ష దీవులు - మినికాయ్ దీవి
బి) కవరత్తి - ఆమ్ని దీవి
సి) అండమాన్ దీవులు - బారెన్ దీవి
డి) లక్షదీవులు - మాల్దీవులు
- View Answer
- సమాధానం: డి
2. ముంబై నగరాన్ని ఏ దీవిపై నిర్మించారు?
ఎ) మాజులి
బి) సాల్సెట్
సి) ఎలిఫెంటా
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
3. లక్ష దీవుల్లో అతిపెద్ద దీవి ఏది?
ఎ) కవరత్తి
బి) మినికాయ్
సి) వైపిన్
డి) బెట్లాట్
- View Answer
- సమాధానం: బి
4. డంకన్ చానల్ కింది వాటిలో ఏ దీవులను వేరుచేస్తుంది?
ఎ) అండమాన్-నికోబార్
బి) ఉత్తర అండమాన్-దక్షిణ అండమాన్
సి) మధ్య అండమాన్-దక్షిణ అండమాన్
డి) దక్షిణ అండమాన్-లిటిల్ అండమాన్
- View Answer
- సమాధానం: డి
5. ‘వాండూర్’ రక్షిత సముద్ర జీవావరణ మండలం (Biosphere Reserve) ఏ దీవుల్లో ఉంది?
ఎ) అండమాన్ - నికోబార్
బి) లక్షదీవులు
సి) ఆలియాబాత్
డి) కవరత్తి
- View Answer
- సమాధానం: ఎ
6. స్థానికంగా ‘కయాల్స్’గా పిలిచే బ్యాక్‌వాటర్ మండలం ఏ తీర మైదానంలో ఉంది?
ఎ) కొంకణ్ తీర మైదానం
బి) మలబార్ తీర మైదానం
సి) కథియావాడ్ తీర మైదానం
డి) కచ్ తీర మైదానం
- View Answer
- సమాధానం: బి
7. పశ్చిమ తీరంలో అతి విశాలమైన తీర మైదానం ఏది?
ఎ) కథియావాడ్
బి) కొంకణ్
సి) కచ్
డి) మలబార్
- View Answer
- సమాధానం: డి
8. వెంబనాడ్ సరస్సు ముఖద్వారం వద్ద ఉన్న ప్రధాన రేవు పట్టణం ఏది?
ఎ) కొచ్చిన్
బి) క్విలన్
సి) మంగళూరు
డి) న్యూమంగళూరు
- View Answer
- సమాధానం: ఎ
9. సుప్రసిద్ధ అంజునా బీచ్ ఏ ప్రాంతంలో ఉంది?
ఎ) మహారాష్ట్ర తీరం
బి) గోవా తీరం
సి) కర్ణాటక తీరం
డి) కచ్ తీరం
- View Answer
- సమాధానం: బి
10. భారతదేశంలో క్రియాశీలక అగ్నిపర్వత ప్రక్రియ ఏ దీవిలో ఉంది?
ఎ) బారెన్ దీవులు
బి) గ్రేట్ నికోబార్ దీవి
సి) లిటిల్ నికోబార్ దీవి
డి) మినికాయ్ దీవి
- View Answer
- సమాధానం: ఎ
11. గ్రేట్ చానల్ కింది ఏ ప్రాంతాలను విడదీస్తుంది?
ఎ) అండమాన్ - కోకో దీవులు
బి) నికోబార్ దీవులు - మన్నార్ సింధు శాఖ
సి) లక్ష దీవులు - మాల్దీవులు
డి) నికోబార్ దీవులు - సుమత్రా దీవి
- View Answer
- సమాధానం: డి
12. భారతదేశ ఏ తీర ప్రాంతం విశాలమైన చిత్తడి ప్రాంతాలతో కూడి ఉంది?
ఎ) కథియావాడ్
బి) కచ్
సి) మలబార్
డి) కొంకణ్
- View Answer
- సమాధానం: బి
13. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ దీవి ‘మాజులి’ ఏ నదీ మైదానంలో ఉంది?
ఎ) గంగ
బి) సింధు
సి) నర్మద
డి) బ్రహ్మపుత్ర
- View Answer
- సమాధానం: డి
14. ఆడమ్స్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది?
ఎ) మన్నార్ సింధు శాఖ
బి) బంగాళాఖాతం
సి) కచ్ సింధు శాఖ
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ