మొక్కలు - వర్గీకరణ, విస్తరణ
1. శైవలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎ) మైకాలజీ
బి) పైకాలజీ
సి) టెరిడాలజీ
డి) పేలినాలజీ
- View Answer
- సమాధానం: బి
2.కిందివాటిలో ఎరువుగా ఉపయోగపడే శైవలం ఏది?
ఎ) స్పైరోగైరా
బి) క్లామిడోమోనాస్
సి) స్పైరులినా
డి) డయాటమ్స్
- View Answer
- సమాధానం: డి
3.‘మొదటి నేల మొక్కలు’గా వేటిని పేర్కొంటారు?
ఎ) టెరిడోఫైటా
బి) శైవలాలు
సి) బ్రయోఫైటా
డి) జిమ్నోస్పెర్మ్స్
- View Answer
- సమాధానం: సి
4. ‘అయోడిన్’ దేని నుంచి లభిస్తుంది?
ఎ) క్లామిడోమోనాస్
బి) క్లాడోపొరా
సి) లామినేరియా
డి) క్లోరెల్లా
- View Answer
- సమాధానం: సి
5. కిందివాటిలో జీవ ఎరువుగా ఉపయోగపడేవి ఏవి?
ఎ) అజొల్లా
బి) రైజోబియం
సి) నీలి ఆకుపచ్చ శైవలాలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
6. ‘కెల్ఫ్స్’ అనేవి ఏ వర్గానికి చెందుతాయి?
ఎ) శిలీంధ్రాలు
బి) శైవలాలు
సి) బ్యాక్టీరియా
డి) బ్రయోఫైటా
- View Answer
- సమాధానం: బి
7. ఆంథిరీడియం అంటే ఏమిటి?
ఎ) పురుష ప్రత్యుత్పత్తి భాగం
బి) స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం
సి) కేసరావళి
డి) అండకోశం
- View Answer
- సమాధానం: ఎ
8. మొక్కల్లో ‘ఫ్రాండ్స’ అనేవి?
ఎ) వేర్లు
బి) పత్రాలు
సి) కాండం
డి) పుష్పాలు
- View Answer
- సమాధానం: బి
9. కిందివాటిలో మైకోరైజాలో ఉండేది ఏది?
ఎ) శిలీంధ్రం
బి) శైవలం
సి) ఎ, బి
డి) నీలి ఆకుపచ్చ శైవలాలు
- View Answer
- సమాధానం: ఎ
10. కిందివాటిలో అలంకరణ కోసం పెంచే పుష్పించని మొక్కలు ఏవి?
ఎ) బ్రయోఫైటా
బి) శైవలాలు
సి) శిలీంధ్రాలు
డి) టెరిడోఫైటా
- View Answer
- సమాధానం: డి
11. ‘అగార్ - అగార్’ వేటి నుంచి లభిస్తుంది?
ఎ) గ్రాసిల్లేరియా
బి) క్లామిడోమోనాస్
సి) నీలి ఆకుపచ్చ శైవలాలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
12. వ్యోమగాములు ఆహారం కోసం ఉపయోగించే శైవలం ఏది?
ఎ) క్లోరెల్లా
బి) వాల్వాక్స్
సి) స్పైరులినా
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
13. పెన్సిలిన్ను ఎవరు కనుగొన్నారు?
ఎ) వాక్స్మన్
బి) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
సి) వాట్సన్
డి) లివెన్ హక్
- View Answer
- సమాధానం: బి
14. జన్యుశాస్త్ర ప్రయోగాల్లో వేటిని ఉపయోగిస్తారు?
ఎ) న్యూరోస్పొరా
బి) అగారికస్
సి) అజొల్లా
డి) రైజోబియం
- View Answer
- సమాధానం: ఎ
15. జీవ పరిణామం ప్రకారం పుష్పించని మొక్కల్లో చివరి దశలో ఉండేవి?
ఎ) బ్రయోఫైటా
బి) టెరిడోఫైటా
సి) శైవలాలు
డి) శిలీంధ్రాలు
- View Answer
- సమాధానం: బి
16. లెకైన్స్ లో ఉండేవి?
ఎ) శిలీంధ్రం, శైవలం
బి) శైవలం, బ్రయోఫైటా
సి) శిలీంధ్రం, బ్రయోఫైటా
డి) బ్రయోఫైటా, టెరిడోఫైటా
- View Answer
- సమాధానం: ఎ
17. ‘వృక్ష రాజ్య తివాచీలు’గా ఏ మొక్కలను పేర్కొంటారు?
ఎ) శైవలాలు
బి) శిలీంధ్రాలు
సి) బ్రయోఫైటా
డి) టెరిడోఫైటా
- View Answer
- సమాధానం: సి