బయోటెక్నాలజీ
1. శరీరంలో ఉండే జన్యు పదార్థమేది?
ఎ) ఆర్ఎన్ఏ
బి) డీఎన్ఏ
సి) ఏటీపీ
డి) ఎన్ఏడీపీ
- View Answer
- సమాధానం: బి
2. బయోటెక్నాలజీ అనే పదాన్ని మొదటగా ఎవరు ఉపయోగించారు?
ఎ) వాట్సన్
బి) క్రిక్
సి) మోర్గాన్
డి) కార్ల ఎరికె
- View Answer
- సమాధానం: డి
3. రెడ్ ఫ్లమ్ అనేది ఒక.. ?
ఎ) వరి వంగడం
బి) టమాటో వంగడం
సి) మొక్కజొన్న వంగడం
డి) గోధుమ వంగడం
- View Answer
- సమాధానం: బి
4. కిందివాటిలో వరి వంగడం ఏది?
ఎ) జగన్నాథ్
బి) రవి
సి) జయ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
5. టమాటో, వంకాయ రకాలను సంకరం చేస్తే ఉత్పన్నమయ్యే రకం?
ఎ) బ్రొమాటో
బి) రాబేజ్
సి) సికేల్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
6. క్లోనింగ్ విధానంలో ఉపయోగపడే కణాలు?
ఎ) ఆర్బీసీ
బి) డబ్ల్యూబీసీ
సి) స్టెమ్‌సెల్స్
డి) ఆస్టియోసైట్స్
- View Answer
- సమాధానం:సి
7. మొట్టమొదటి క్లోన్ ఏది?
ఎ) మాటిల్డా
బి) స్వప్ని
సి) డాలి
డి) జియోజియో
- View Answer
- సమాధానం: సి
8. కిందివారిలో జన్యుశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు?
ఎ) ఎం.ఎస్. స్వామినాథన్
బి) హెచ్.జి. ఖొరానా
సి) వాట్సన్ - క్రిక్
డి) బి, సి
- View Answer
- సమాధానం: డి
9. హరిత విప్లవ పితామహుడెవరు?
ఎ) హెచ్.జి. ఖొరానా
బి) సి.వి. రామన్
సి) నార్మన్ ఇ. బోర్లాగ్
డి) పైన పేర్కొన్నవారెవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
10. క్లోనల్ వరణంలో ఉత్పత్తి చేసిన రకం?
ఎ) కూప్రి రెడ్ - బంగాళాదుంప
బి) కూప్రి సఫేద్ - బంగాళాదుంప
సి) పెదనీలం - మామిడి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
11. నీటి ఎద్దడిని తట్టుకునే వరి రకం?
ఎ) SRI
బి) గోల్డెన్ రైస్
సి) IR-8
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
12. IRRI ఎక్కడ ఉంది?
ఎ) కటక్
బి) మనీలా
సి) కోల్‌కతా
డి) ఢిల్లీ
- View Answer
- సమాధానం: బి
13. బంగాళాదుంప పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) డెహ్రాడూన్
బి) సిమ్లా
సి) ఢిల్లీ
డి) లక్నో
- View Answer
- సమాధానం: బి
14. డీఎన్ఏ టెక్నాలజీలో ఉపయోగపడే ఎంజైములేవి?
ఎ) ఎండో న్యూక్లియేజ్‌లు
బి) లిగేజ్లు
సి) ఎ, బి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
15. ఉద్యానవనాల్లో మొక్కలను జంతువుల ఆకృతుల్లో తయారు చేయడానికి ఉపయోగపడే అంశం?
ఎ) సుప్తావస్థ
బి) అగ్రాధిక్యత
సి) అనిషేక ఫలనం
డి) కార్బన్ డేటింగ్
- View Answer
- సమాధానం: బి
16. నేరస్థులను నిర్ధారించడానికి ఉపయోగించే డీఎన్ఏ ఏది?
ఎ) B-DNA
బి) r-DNA
సి) z-DNA
డి) c-DNA
- View Answer
- సమాధానం: డి
17. శరీర భాగాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే కణాలేవి?
ఎ) చర్మసంబంధ కణాలు
బి) పిండ సంబంధ కణాలు
సి) ఎముక సంబంధ కణాలు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
18. ‘ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్’ గ్రంథాన్ని రాసిన వారెవరు?
ఎ) డార్విన్
బి) మెండల్
సి) థియోప్రాస్టస్
డి) లిన్నేయస్
- View Answer
- సమాధానం: ఎ
19. సెల్ బ్రెయిన్ అని దేన్ని అంటారు?
ఎ) మైటోకాండ్రియా
బి) రిక్తిక
సి) కేంద్రకం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
20. డీఎన్ఏ టెక్నాలజీలో డీఎన్ఏ ముక్కలను శుభ్రపరిచే పద్ధతి?
ఎ) సదరన్ బ్లాటింగ్
బి) వెస్టర్న్ బ్లాటింగ్
సి) ఎలక్ట్రో ఫోరెసిస్
డి) ఎ, సి
- View Answer
- సమాధానం: డి
21. ఇండియాలో మొదటి టెస్ట్‌ట్యూబ్ బేబీ?
ఎ) బేబీ హర్ష
బి) లూయీస్ జాయ్ బ్రౌన్
సి) ప్రొమోటి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
22. అంటుకట్టే విధానంలో ప్రధానంగా ఉపయోగపడే భాగమేది?
ఎ) సక్కర్
బి) స్టోలన్
సి) ఆఫ్సెట్
డి) రన్నర్
- View Answer
- సమాధానం: బి
23. కణజాల వర్ధనంలో ఉపయోగించే మొక్క భాగం?
ఎ) టోటిపోటెంట్
బి) ఎక్స్‌ప్లాంట్
సి) కాలస్
డి) ఎంబ్రియాయిడ్
- View Answer
- సమాధానం: బి
24. సంశ్లేషక విత్తనాలు (సింథటిక్ సీడ్స్) ఏ విధానంలో ఏర్పడతాయి?
ఎ) సంకరణం
బి) టిష్యూకల్చర్
సి) వరణం
డి) ఉత్పరివర్తనాలు
- View Answer
- సమాధానం: బి
25. సీసీఎంబీ ఎక్కడ ఉంది?
ఎ) ఢిల్లీ
బి) కోల్‌కతా
సి) ముంబై
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: డి
26. ఇక్రిశాట్లో ఎన్ని పంటలపై పరిశోధనలు చేస్తారు?
ఎ) 4
బి) 5
సి) 12
డి) 6
- View Answer
- సమాధానం: బి
27. జాతీయ వరి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) బెంగళూరు
బి) కటక్
సి) చెన్నై
డి) ఢిల్లీ
- View Answer
- సమాధానం: బి
28. కృత్రిమంగా వేరొక స్త్రీ గర్భాశయంలో ఆమె అనుమతితో శిశువును పెంచే విధానం?
ఎ) టెస్ట్‌ట్యూబ్ బేబీ
బి) క్లోన్
సి) సరోగసి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
29. జెనెటిక్ ఇంజనీరింగ్‌లో ఎక్కువగా ఉపయోగపడే బ్యాక్టీరియా?
ఎ) బాసిల్లస్ థురెంజియన్సిస్
బి) ఇ.కోలి
సి) రైజోబియం
డి) క్లాస్ట్రీడియం
- View Answer
- సమాధానం: బి
30. మీథేన్ వాయువును ఉత్పత్తి చేసే ప్రక్రియ?
ఎ) కిణ్వనం
బి) జీర్ణక్రియ
సి) దహనం
డి) విచ్ఛిన్నం
- View Answer
- సమాధానం: ఎ
31. ఉత్పరివర్తనాలను కనుగొన్నదెవరు?
ఎ) డార్విన్
బి) డివ్రీస్
సి) మెండల్
డి) హెకెల్
- View Answer
- సమాధానం: బి
32. మనం ఉపయోగించే బ్రెడ్ వీట్ (ట్రిటికం ఈస్టివం) అనేది?
ఎ) 2n
బి) 3n
సి) 6n
డి) 4n
- View Answer
- సమాధానం: సి
33. జట్రోపా అనేది .......
ఎ) నూనె మొక్క
బి) బయోడీజిల్ మొక్క
సి) పప్పుధాన్యాల మొక్క
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
34. మొదటిసారిగా క్లోన్‌ను సృష్టించిన దేశం?
ఎ) ఇండియా
బి) అమెరికా
సి) ఇంగ్లండ్
డి) స్కాట్లాండ్
- View Answer
- సమాధానం: డి
35. నూనె గింజలకు సంబంధించిన విప్లవం?
ఎ) హరిత విప్లవం
బి) శ్వేత విప్లవం
సి) పసుపు విప్లవం
డి) నలుపు విప్లవం
- View Answer
- సమాధానం: సి
36. అంటుకట్టే విధానంలో మొక్కకు ఆహారాన్ని ఇచ్చేది?
ఎ) సక్కర్
బి) స్టాక్
సి) సియాన్
డి) స్టోలన్
- View Answer
- సమాధానం: బి
37. క్లోనింగ్ విధానంలో వాంఛనీయమైన లక్షణాలు రావడానికి కారణం?
ఎ) ప్రత్యుత్పత్తి కణాల కలయిక పూర్తిగా జరగడం
బి) ప్రత్యుత్పత్తి కణాల కేంద్రకాల కలయిక
సి) ఒక కణానికి చెందిన కేంద్రకం మాత్రమే పిల్ల జీవిలోకి ప్రవేశించడం
డి) రెండు కేంద్రకాలు పాల్గొనకపోవడం
- View Answer
- సమాధానం: సి
38. డీఎన్ఏ టెక్నాలజీలో డీఎన్ఏ ఖండితాలను వేరుచేయడానికి ఉపయోగించే ఉత్తమ పద్ధతి?
ఎ) సదరన్ బ్లాటింగ్
బి) వెస్టర్న బ్లాటింగ్
సి) ఎలక్ట్రో ఫోరసిస్
డి) పీసీఆర్
- View Answer
- సమాధానం: డి
39. డీఎన్ఏ టెక్నాలజీతో ఉత్పత్తి చేసిన వంగడం?
ఎ) పత్తి
బి) వంకాయ
సి) వరి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
40. పెన్సిలిన్‌ను దేని నుంచి తయారుచేస్తారు?
ఎ) బ్యాక్టీరియా
బి) వైరస్
సి) శైవలం
డి) శిలీంధ్రం
- View Answer
- సమాధానం: డి
41. సీసీఎంబీ డెరైక్టర్ ఎవరు?
ఎ) లాల్జీసింగ్
బి) మోహన్‌రావు
సి) ఎమ్.ఎస్. స్వామినాథన్
డి) కృష్ణయ్యర్
- View Answer
- సమాధానం: బి
42. ICAR ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) ఢిల్లీ
బి) కోల్‌కతా
సి) పుణే
డి) ముంబై
- View Answer
- సమాధానం: ఎ
43. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది?
ఎ) ఢిల్లీ
బి) పుణే
సి) డెహ్రాడూన్
డి) కోల్‌కతా
- View Answer
- సమాధానం: బి
44. కృత్రిమంగా జన్యువును నిర్మించిన ప్రముఖ భారతదేశ శాస్త్రవేత్త?
ఎ) సి.వి. రామన్
బి) హెచ్.జి. ఖొరానా
సి) గ్రెగర్ మెండల్
డి) ఎం.ఎస్. స్వామినాథన్
- View Answer
- సమాధానం: బి
45. వరిపొలాల్లో నత్రజని స్థాపన కోసం ఉపయోగించే జీవ ఎరువు?
ఎ) అజొల్లా
బి) రైజోబియం
సి) క్లాస్ట్రీడియం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
46. మానవుని జీనోమ్ ప్రాజెక్టులో సుమారు ఎన్ని జన్యువులు ఉన్నట్లు కనుగొన్నారు?
ఎ) 3040
బి) 2030
సి) 4060
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
47. సూపర్ ఒవ్యులేషన్ విధానాన్ని వేటిలో చేస్తారు?
ఎ) పశువులు
బి) గొర్రెలు
సి) పందులు
డి) కుందేలు
- View Answer
- సమాధానం: ఎ
48. కిందివాటిలో ఎలుక క్లోన్ ఏది?
ఎ) స్వప్ని
బి) జియోజియో
సి) డాలి
డి) విజి-20
- View Answer
- సమాధానం: బి
49. మిరప పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) రాజమండ్రి
బి) గుంటూరు
సి) విజయవాడ
డి) తెనాలి
- View Answer
- సమాధానం: బి
50. చర్మశుద్ధి కర్మాగారాలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి?
ఎ) చెన్నై
బి) ఢిల్లీ
సి) పుణే
డి) కోల్‌కతా
- View Answer
- సమాధానం: ఎ
51. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఉత్పత్తి చేసిన కాటన్ రకం?
ఎ) సి.టి. కాటన్
బి) బి.సి. కాటన్
సి) బి.టి. కాటన్
డి) బి.డి. కాటన్
- View Answer
- సమాధానం: సి