Govt Junior College: సార్లు రారు.. పాఠాలు బోధించరు
దీంతో మండల వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కళాశాలను స్థానిక టీఎస్‌ఎన్‌ఆర్ ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. కళాశాల ప్రారంభమవడంతో మండల వి ద్యార్థులు అడ్మిషన్లు పొందారు. తీరా కళాశాలకు రోజు వస్తున్నప్పటికీ తరగతులు చెప్పడానికి రో జుకు కనీసం ఒక్క లెక్చరర్ కూడా రాకపోవడంతో విద్యార్థులు వె నుదిరుగుతున్నారు. కళాశాలలో 62 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
రోజుకు నలుగురు చొప్పున..
బీబీపేటలో నూతనంగా మంజూరైన ఇంటర్ కళాశాలలో విద్యార్థులకు బోధిచడానికి ఉన్నతాధికారు లు లెక్చరర్లను ఇతర కళాశాలల నుంచి రోజుకు న లుగురు చొప్పున కేటాయించారు. కానీ కళాశాలకు మాత్రం రోజుకు ఒకరు కూడా హాజరు కావడం లే దు. సోమ, మంగళ, బుధవారాల్లో నలుగురు చొ ప్పున, సెప్టెంబర్ 7న, శుక్రవారం, శనివారం రోజున నలుగురు చొప్పున ఇతర కళాశాలల నుంచి కేటా యించినప్పటికీ ఒకరిద్దరు హాజరు కావడం తప్ప మిగిలిన లెక్చరర్లు హాజరు కావడం లేదు. అధికారు ల ఆదేశాలు సైతం పాటించకుండా లెక్చరర్లు పాత కాలేజ్‌లోనే ఉండిపోవడంతో ఇక్కడి విద్యార్థులు న ష్టపోతున్నారు. ప్రిన్సిపల్‌తో మొరపెట్టుకున్నప్పటి కీ ప్రయోజనం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
కళాశాలలో నాలుగు గ్రూపులు
నూతనంగా మంజూరైన కళాశాలలో ఎంపీసీ, బైపీ సీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులను ప్రవేశపెట్టడంతో పాటు అడ్మిషన్లను తీసుకున్నారు. 62 మంది విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లను పొందారు. కానీ ఇ ప్పటివరకు కూడా కొన్ని సబ్జెక్టులు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు లెక్చరర్లు వాపోతున్నారు.
మూడు నెలలు కావస్తున్నా..
ఇంటర్ కళాశాల ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా కొన్ని సబ్జెక్టులు ప్రా రంభం కాలేవు. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఎకనామి క్స్, తెలుగు, ఇంగ్లీష్, బాటనీ, జూవాలజీ సబ్జెక్టులకు సంబంధించి ఇప్పటివరకు ఒక పాఠం కూడా పూర్తి కాలేదు.