Skip to main content

పరీక్షల వరకూ మిత్తల్‌ను ఉంచాలి

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి, ఇంటర్‌ విద్య కమిషనర్‌గా నవీన్‌ మిత్తల్‌నే కొనసాగించాలని ప్రభుత్వ లెక్చరర్లు డిమాండ్‌ చేస్తున్నారు.
Mittal should be kept till intermediate exams
పరీక్షల వరకూ మిత్తల్‌ను ఉంచాలి

ఈ మేరకు ఫిబ్రవరి 3న రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ప్రభుత్వ కాలేజీలోనూ ఉద్యోగులు ప్రిన్సిపాళ్లను కలసి వినతి పత్రాలు సమరి్పంచారు. ఇంటర్‌ వ్యవస్థలో కీలకమైన సంస్కరణలకు నాంది పలికిన మిత్తల్‌ను పరీక్షల సమయంలో కదిలిస్తే అరాచక శక్తులు ఇష్టానుసారం వ్యవహరించే ప్రమాదం ఉందని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులకు నష్టం జరుగుతుందని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

ముఖ్యంగా ప్రైవేటు కాలేజీల ఆన్‌లైన్‌ మూల్యాంకనాన్ని అడ్డుకునే ప్రయత్నాన్ని నిరోధించడానికి ఆయనను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి (టీఐపీఎస్‌), తెలంగాణ ఇంటర్మీమడియట్‌ గవర్నమెంట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ (టీఐజీఏల్‌ఏ) నేతలు మాచర్ల రామకృష్ణాగౌడ్, కొప్పిశెట్టి సురేశ్‌ నాయకత్వం వహించారు. అధ్యాపకుల అభిప్రాయాలతో కూడిన వినతి పత్రాన్ని ఉద్యోగ నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పంపారు.

Published date : 04 Feb 2023 02:50PM

Photo Stories