Skip to main content

Inter Exams: పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి

Mask is mandatory for exam attendance
Mask is mandatory for exam attendance
  •      ఇంటర్‌ విద్యార్థులకు సూచన  

సాక్షి, సిటీబ్యూరో: త్వరలో జరగనున్న ఇంటరీ్మడియెట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని హైదరాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత  అధికారులను ఆయన ఆదేశించారు. 

also read: Medical Recruitment: వైద్య పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్‌!

    సోమవారం  తన చాంబర్‌లో ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణపై విద్య, వైద్య, పోలీస్, జలమండలి, విద్యుత్, ఆరీ్టసీ, పోస్టల్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సుమారు 1.53 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్న నేపథ్యంలో 234 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూట్‌ బస్‌ పాస్‌ ఉన్న విద్యార్థులు ఆ రూట్లలోనే కాకుండా హాల్‌ టికెట్, బస్‌ పాస్‌ కలిపి చూపించి వేరే మార్గాలలోనూ ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్‌ షాపులను మూసివేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సూర్యలత, జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి వడ్డెన్న, అడిషనల్‌ డీసీపీ ప్రసాద్, పొలీస్‌ ఇన్‌స్పెక్టర్‌  రామచంద్రం, విద్యుత్‌ శాఖ అధికారి స్రవంతి, వాటర్‌ వర్క్స్‌ స్వామి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్‌ రావు, పోస్టల్‌ శాఖ సిబ్బంది శశాంత్‌ కుమార్, ఆర్టీసీ డివిజినల్‌ మేనేజర్‌ జానిరెడ్డి తదితరులు 
పాల్గొన్నారు.  

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 26 Apr 2022 01:25PM

Photo Stories