TSBIE: ఒకేషనల్ విద్యార్థుల పాతపరీక్ష విధానానికి ఆఖరి చాన్స్
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందరికీ ఒకే విధానం అమలు చేస్తామంది. మారిన విధానాన్ని గతంలో ఫెయిల్ అయిన వారూ అనుసరించాలని స్పష్టంచేసింది. వీరికి 2024లో జరి గే పరీక్షల వరకే పాత పద్ధతి అమల్లో ఉంటుందని తెలిపింది. 2012–13 నుంచి ఒకేషనల్ థియరీ పరీక్ష విధానంలో మార్పులొచ్చాయి. ఇంగ్లిష్, జనరల్ ఫౌండేషన్ కోర్సుల ప్రశ్నపత్రం 75కు బదులు 50 మార్కులకు మార్చా రు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
ఆన్ ద జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) ప్రశ్నపత్రాన్ని 50కి బదులు 100 మార్కులకు మార్చా రు. అయితే, 2012కు ముందు ఒకేషనల్ కో ర్సు చేసి, కొన్ని సబ్జెక్టులు బ్యాక్‌లాగ్ ఉన్న వి ద్యార్థులు పాత విధానంలోనే పరీక్షలు రాస్తు న్నారు. వీరికి కొత్త విధానంలో నిర్ణయించిన మార్కులకు లెక్కగట్టి మెమో ఇస్తున్నారు. ఉ దాహరణకు ఇంగ్లిష్‌లో 75 మార్కులకు బదు లు 50 మార్కులకు ఉంటే, వచ్చిన మార్కుల ను 50 మార్కులకు విభజిస్తారు. ఇలాంటి వా ళ్లు వచ్చే ఏడాది నుంచి మారిన విధానాన్ని వి ధిగా అనుసరించాలని బోర్డు స్పష్టంచేసింది.