Intermediate Results: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు తీరు ఇలా..
ఇంటర్ ద్వితీయ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో 59,669 (46%) మంది పాసయ్యారు. ఈ మేరకు జూలై 7న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 89 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా ముందు ఉంటే, 33 శాతం ఉత్తీర్ణత సాధించిన రాజన్న సిరిసిల్ల జిల్లా చివరన ఉంది. ఫస్టియర్‌లో ఏ గ్రేడ్ పొందిన విద్యార్థులు 75,541 మంది ఉంటే, ద్వితీయ ఇంటర్‌లో కేవలం 24 మంది మాత్రమే ఉన్నారు.
రెండేళ్ల ఫలితాల్లోనూ బాలికల ఉత్తీర్ణత శాతమే ఎక్కువగా ఉంది. మొదటి సంవత్సరంలో మార్కులు మెరుగుపరచుకోవడానికి ఇంప్రవ్‌మెంట్ రాసిన వారు 1,57,741 మంది ఉన్నారు. ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయి.. పరీక్షకు హాజరైన వారు 45,576 మంది ఉన్నారు. మార్కుల జాబితాను జూలై 8 నుంచి ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూలై 12వ తేదీ వరకు అవకాశం ఇచ్చినట్టు బోర్డు వెల్లడించింది.
ఫస్టియర్ ఫలితాలు ఇలా..
|
జనరల్ |
ఒకేషనల్ |
పరీక్ష రాసిన మొత్తం విద్యార్థులు |
2,52,055 |
18,697 |
ఇంప్రూవ్‌మెంట్ రాసిన వారు |
1,12,165 |
1,998 |
ఫెయిల్ అయి రాసిన వారు |
45,576 |
8,321 |
ఉత్తీర్ణులు |
1,57,741 |
10,319 |
ఏ గ్రేడ్ |
75,541 |
2,649 |
బీ గ్రేడ్ |
36,015 |
6,853 |
సీ గ్రేడ్ |
24,580 |
753 |
డీ గ్రేడ్ |
21,605 |
64 |
ఉత్తీర్ణత శాతం |
63 |
55 |
బాలికల ఉత్తీర్ణత శాతం |
68.62 |
69.09 |
బాలుర ఉత్తీర్ణత శాతం |
57.40 |
47.82 |
సెకండియర్ ఫలితాలు ఇలా..
|
జనరల్ |
ఒకేషనల్ |
పరీక్ష రాసిన విద్యార్థులు |
1,29,494 |
11,013 |
ఉత్తీర్ణులు |
59,669 |
6,579 |
ఉత్తీర్ణత శాతం |
46 |
60 |
బాలికల ఉత్తీర్ణత శాతం |
51 |
71 |
బాలుర ఉత్తీర్ణత శాతం |
43 |
56 |
ఏ గ్రేడ్ ఉత్తీర్ణులు |
24 |
0 |
బీ గ్రేడ్ ఉత్తీర్ణులు |
14 |
0 |
సీ గ్రేడ్ ఉత్తీర్ణులు |
7 |
0 |
డీ గ్రేడ్ ఉత్తీర్ణులు |
0 |
0 |
☛ TS Inter 1st Year Adv. Supplementary Results 2023 - General | Vocational
☛ TS Inter 2nd Year Adv. Supplementary Results 2023 - General | Vocational