Skip to main content

TSBIE: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు?

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ ప్రవేశాల గడువు జూలై 24తో ముగుస్తోంది. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరగలేదు. దీంతో మరికొంత గడువు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
TSBIE
ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు?

గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అడ్మిషన్లు సరిగా జరగడం లేదని జిల్లాల్లోని ఇంటర్‌ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా మరికొంత గడువు పొడిగించాలని ఉన్నతాధికారులను కోరారు. దీంతో క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ప్రవేశాల గడువు పెంపునకు ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కాలేజీల్లోనే సమస్య ఉందని అధికారులు తెలిపారు. 

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ​​​​​​​ఏపీ ఇంటర్

హెచ్చరికతో ప్రైవేటు కాలేజీలు అప్రమత్తం..

రాష్ట్రవ్యాప్తంగా 3,339 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు ఉండగా.. వీటిల్లో ఇప్పటి వరకు 3,27,202 మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌లో అడ్మిషన్‌ తీసుకున్నారు. గత ఏడాది (2022–23) కాలేజీల సంఖ్య 3,107 మాత్రమేకాగా, 4,98,699 మంది విద్యార్థులు చేరారు. దీనిని బట్టి దాదాపు 1.7 లక్షల మంది విద్యార్థులు ఇంకా చేరాల్సి ఉందని తెలుస్తోంది. వారంరోజుల క్రితం వరకూ ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతున్నా, ప్రవేశాల­ను బోర్డుకు చూపించలేదు. విద్యార్థుల ప్రవేశాలు ఒక­చోట, వారు చదివేది మరోచోట ఉండేలా కాలేజీలు చేస్తు­న్న మాయాజాలంపై ఇంటర్‌ బోర్డు ఉక్కుపాదం మోప­డమే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ‘సాక్షి’ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో ప్రభుత్వం స్పందించింది. అడ్మిషన్లు ముగిసే నాటికి ప్రవేశాలు చూపించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యద­ర్శి నవీన్‌ మిత్తల్‌ హెచ్చరించారు. దీంతో గత వారం లక్ష వరకూ ఉన్న అడ్మిషన్ల సంఖ్య ప్రస్తుతం 2 లక్షలు దాటింది. టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వెలువడిన తర్వా­త ప్రభుత్వ కాలేజీల్లోనూ ప్రవేశాలు కొంత పెరిగాయి. 

Published date : 25 Jul 2023 11:48AM

Photo Stories