Skip to main content

Intermediate: ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు రసాయనం కరువు

మంచిర్యాలఅర్బన్‌: తరగతి గదిలో నేర్చుకున్న పాఠాన్ని తెలుసుకునేందుకు కృత్యాలు.. ప్రయోగాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
Chemical drought for inter practicals

వందశాతం మార్కులు సాధించేందుకు ప్రయోగ(ప్రాక్టికల్‌) పరీక్షలు దోహదపడుతాయి. అంతటి ప్రాధాన్యమున్న ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలకు క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆధునికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాల్సిన ఈ రోజుల్లో ఇంటర్‌లో మాత్రం నాలుగేళ్ల క్రితం సరఫరా చేసిన సైన్స్‌ పరికరాలు మినహాయిస్తే ఇప్పటివరకు పంపిణీ చేసిందేం లేదు.

కళాశాలలు ప్రారంభమై ఆర్నెల్లు కావస్తుండడంతో ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. కానీ ప్రయోగాలకు అవసరమయ్యే రసాయన సామగ్రిని సరఫరా చేయకపోవడంతో ప్రాక్టికల్స్‌ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

తప్పని ఎదురుచూపులు

జిల్లాలో పది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉ న్నాయి. ఇందులో 3,236 మంది విద్యార్థులు విద్య ను అభ్యసిస్తున్నారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో మాత్రమే ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రయోగ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. పాఠశాల స్థాయిలోనే పరిశోధనలకు బీజం వేయాల్సి ఉన్నా నామమాత్రంగా మారింది. పరిశోధన లేకపోవడంతో ప్రతిభకు పదును లేకుండా పోతోంది. దీంతో విద్యార్థులకు ప్రయోగాలకు సంబంధించి ఇంటర్‌ మొదటి సంవత్సరంలోనే నేర్పించాల్సి ఉంటుంది.

2014కు ముందు సైన్స్‌ విద్యార్థుల నుంచి ప్రత్యేక ఫీజు రూపేణా రూ.800 చొప్పున వసూలు చేసేవారు. కళాశాలలకు అవసరమైన సైన్స్‌ సామగ్రి కొనుగోలు చేసేవారు. 2015లో ఉచిత విద్య అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రవేశాలకు ఫీజు వసూలు చేయడం నిలిచిపోయింది. ఆ తర్వాత ఏడాది, రెండేళ్ల పాటు నిధులు విడుదల చేసిన ఇంటర్‌ బోర్డు ప్రస్తుతం రసాయనాల గురించి పట్టించుకోవడంలేదు. దీంతో చాలా కళాశాలల్లో బోధనోపకరణాల్లేక ప్రాక్టికల్‌ పరీక్షలు నామమాత్రంగా మారుతున్నాయి.

సొంత డబ్బులతోనే..

గతంలో ప్రభుత్వం ఒక్కో జూని యర్‌ కళాశాలలో ప్ర యోగాల నిర్వహణకు రూ.25 వేల నుంచి రూ.30వేలు అందజేసేది. కరోనా తర్వాత పైసా విదల్చకపోవడంతో ఆయా కళాశాలల నిర్వాహకులే చిన్నచిన్న అవసరాలకు సొంత డబ్బులతో సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. బోటనీ, జువాలజీ ల్యాబ్స్‌ జంతు కళేబరాలు, అవశేషాలు విద్యార్థులకు చూపించాల్సి ఉంటుంది.

ఆకు, కాండం తదితర విషయాలు తెలుసుకునేందుకు మైక్రోస్కోప్‌లు వినియోగించాలి. రసాయనశాస్త్రంలో లవణ, విశ్లేషణ, మూలకాలు, తదితర వాటిగురించి తెలియాలంటే రసాయనాలు అవసరం. ఇందులో కొన్ని ప్రమాదకరమైనవి ఉంటాయి. ప్రత్యేక ల్యాబ్‌ ఉంటే సౌకర్యవంతంగా ఉటుంది.

జిల్లాలో మా త్రం తరగతి గదుల్లోనే ల్యాబ్‌ పరికరాలతో నెట్టుకురావాల్సి వస్తోంది. మ రోవైపు పాఠ్యాంశాల ప్రకా రం పంపాల్సిన పరికరాల బదులు కొన్నిచోట్ల అవసరానికంటే తక్కువగా పంపించినట్లు తెలు స్తోంది. దీంతో ఏళ్ల క్రితం(పాత) పంపిణీ చేసిన పరికరాలతో ప్రయోగాలు ఎలా చేయాలో తెలియకుండా పోతోంది.

ప్రయోగ పరికరాలు గాజుకు సంబంధించినవి కావడంతో పరిశోధన చేస్తున్న క్రమంలో కింద పడి పగిలిన సందర్భాలు లేకపోలేదు. హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌, సల్ఫర్‌ యాసిడ్‌తో 24 రకాల సాల్ట్‌(లవణాలు) అవసరం ఉంటుంది. ఏ ఒక్క కెమికల్‌ లేకపోయినా ప్రయోగాలకు అంతరాయం కలుగుతుంది.

ప్రభుత్వం నిధులు విదల్చకపోవడంతో పరికరాలు, రసాయనాలు లేకుండా ప్రయోగాలు చేయడం కష్టతరంగానే మారింది. ప్రిన్సిపాళ్లు, సంబంధిత సబ్జెక్టు బోధకులు చొరవ చూపి సొంతంగా నిధులు వెచ్చిస్తే తప్ప ప్రయోగం కొనసాగేలా లేదు.

ప్రతిపాదనలు పంపాం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రయోగాలకు సంబంధించిన పరికరాలు, కెమికల్స్‌ కొనుగోలుకు నిధులు రావాల్సి ఉంది. కరోనా కంటే ముందు ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రయోగాలకు అవసరమైన రసాయనాలు అందజేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరికరాలతో ప్రయోగ పాఠాలు బోధించేలా చర్యలు చేపట్టాం. అవసరమైన పరికరాలకు ప్రతిపాదనలు పంపాం. నిధులు కేటాయిస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది.
– శైలజ, డీఐఈవో, మంచిర్యాల

నిరుపయోగంగా మోడల్‌ లాబొరేటరీ

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్మించిన ఆదర్శ ప్రయోగశాల భవనం నిరుపయోగంగా ఉంది. మోడల్‌ లాబొరేటరీగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో డీఎంఎఫ్‌టీ నిధులు రూ.40 లక్షల వ్యయంతో 2019 ఫిబ్రవరి 18న భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా పనులు పూర్తయ్యాయి.

భవనం పూర్తయినా సైన్స్‌ ప్రయోగ పరికరాల ఏర్పాటులో నిర్లక్ష్యంతో ఆదర్శ ప్రయోగశాల వినియోగంలోకి రాకుండా పోతోంది.

Published date : 06 Jan 2024 02:57PM

Photo Stories