Intermediate: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. పరీక్ష తేదీలు ఇవే..
ఫిబ్రవరి 5న కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో విద్య, వైద్య, పోలీస్, జలమండలి, విద్యుత్, ఆర్టీసి, పోస్టల్ శాఖ అధికారులతో ఆయ న సమీక్షించారు. ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు పరీక్షలను 242 కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సుమారు లక్షా 74 వేల 368 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, పరీక్ష కేంద్రాలలోకి ఉదయం 8.30 వరకు అనుమతించడం జరుగుతుందన్నారు. విద్యార్థులందరూ నిర్ధేశిత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించా రు. విద్యార్థులందరూ పరీక్షా కేంద్రాలకు క్యాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు, ఎలక్ట్రానిక్ వాచీలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదని సూచించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్సు షాపులను మూసివేసి 144 సెక్షన్ విధించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీ బాబురావు, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశా ఖాధికారి వడ్డెన్న, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, మెడికల్ ఆఫీసర్ వెంకటి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.