TS INTER: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఈ నెల 16 వరకు అడ్మిషన్లు
సాక్షి, ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ చేరాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మరో అవకాశాన్ని కల్పించింది. అనివార్య కారణాలతో ముందుగా నిర్ణయించిన తేదీలోపు అడ్మిషన్ తీసుకుని విద్యార్థులకు ఇదొక అవకాశం. సెప్టెంబర్ 16వ తేదీ వరకు విద్యార్థులు ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్ పొందవచ్చు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇక ప్రైవేటు కళాశాలల్లో రూ.1000 లేట్ ఫీజుతో అడ్మిషన్ పొందొచ్చని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని కాలేజీల ప్రాన్సిపల్స్ తమ ఆదేశాలను పాటించాలని సూచించారు. అయితే ప్రభుత్వ అనుమతి ఉన్న కాలేజీల్లోనే జాయినవ్వాలని సూచించింది. టీఎస్‌బీఐఈ.సీజీజీ.జీఓవీ.ఇన్ లేదా, ఏసీఏడీటీఎస్‌బీఐఈ.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్లలో అనుమతులున్న కాలేజీల వివరాలు ఉంటాయని అధికారులు సూచించారు.
చదవండి: ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు కుదిరింది?
చదవండి: 23 ఏళ్లకే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన శ్రీకాకుళం కుర్రాడు...