10th Class & Inter: హాల్‌టికెట్ ఇవ్వకుంటే చర్యలు
ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు ఫీజుల కోసం వేధింపులకు గురిచేస్తున్నారు. నిత్యం పిల్లల తల్లిదండ్రులకు ఫోన్లు చేయడంతోపాటు మెస్సేజ్‌లు పంపి, ఫీజులు కట్టాలని లేదంటే హాల్‌టికెట్ ఇవ్వబోమని తెగేసి చెబుతున్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ప్రైవేట్ యాజమాన్యాలు ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. మానవత్వంతో ఆలోచించక విద్యార్థులను వెనక్కి పంపుతుండటంతో పరీక్షల సమయంలో వారు మానసిక వేదనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.’
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
ఫీజుల పేరిట విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేయడం తగదు. హాల్‌టికెట్ ఇవ్వకుంటే సంబంధిత కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. మానవీయ కోణంలో ఆలోచించి, విద్యార్థులకు సహకరించాలి.
– జగన్మోహన్‌రెడ్డి, డీఐఈవో
అధికారులు పట్టించుకోవడం లేదు
ప్రైవేట్ యాజమాన్యాలు బరితెగించి ఫీజులు వసూలు చేస్తున్నాయి. అధికారులు మామూళ్లకు అలవాటుపడి, చర్యలు తీసుకోవడం లేదు. హాల్‌టికెట్లు ఇవ్వకుంటే ఊరుకోం. విద్యాసంస్థల తీరుపై డీఐఈవో, డీఈవో దృష్టిసారించాలి.
– మచ్చ రమేశ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి