Telangana Inter 2nd Year Results : ఇంటర్ సెకండియర్ ఇయర్ ఫలితాలు ఎప్పుడంటే..? డైరెక్ట్ లింక్ ఇదే..
అలాగే ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ కూడా పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో జూన్ 15 తేదీలోగా ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ధృడ నిశ్చయంతో ఉంది. మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియెట్ పరీక్షలు మే 24న ముగిసిన విషయం తెల్సిందే. తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌ను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.
How to check TS Inter 2nd Year 2022 Results:
➤ Visit results.sakshieducation.com or education.sakshi.com
➤ Click on TS Inter 2nd year results - General / Vocational on the home page
➤ In the next page, enter your hall ticket number and submit
➤ The results will be displayed on the screen.
➤ Save a copy of the marks sheet for further reference.
ఈ సారి ఇంటర్ సెకండియర్ పరీక్షలకు..
ఈ సారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు. అలాగే ఈ సారి 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 25,530 మంది ఇన్విజిలేటర్లను, 150 మందితో సిట్టింగ్ స్క్వాడ్, మరో 75 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి పటిష్టంగా పరీక్షలను నిర్వహించారు. అలాగే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4,64,626 మంది విద్యార్థులు హాజరయ్యారు.
After Inter BiPC: వెటర్నరీ సైన్స్‌తో ఉద్యోగావకాశాలు.. బీవీఎస్సీతో డాక్టర్ హోదా పొందొచ్చు...
ఇంటర్ పరీక్షల ప్రశ్నపత్రాలను..
గత రెండు సంవత్సరాలుగా కరోనాతో విద్యా సంవత్సరంలో ఒడిదొడుకులు చోటుచేసుకున్న విషయం తెల్సిందే. అలాగే ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేశారు. అలాగే ఈ సారి ఇంటర్ పరీక్షల ప్రశ్నపత్రాలను 70 శాతం సిలబస్ నుంచి మాత్రమే ఇచ్చారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
After Inter: ఇంటర్మీడియెట్ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..
తెలంగాణలో ఈ సారి జరిగిన ఇంటర్ సెకండియర్ పరీక్షల తేదీలు ఇవే..
తేదీ |
పరీక్ష |
7–5–22 |
ద్వితీయ భాష |
10–5–22 |
ఇంగ్లిష్ |
12–5–22 |
మ్యాథ్‌స్ –2ఎ, బాటనీ, పొలిటికల్ సైన్స్ |
14–5–22 |
మ్యాథ్‌స్ –2బి, జువాలజీ, హిస్టరీ |
17–5–22 |
ఫిజిక్స్, ఎకనామిక్స్ |
19–5–22 |
కెవిుస్ట్రీ, కామర్స్ |
21–5–22 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ |
24–5–22 |
మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ |