Department of School Education: టీచర్ల పరస్పర బదిలీలకు సర్కారు ఓకే
Sakshi Education
ఎట్టకేలకు ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
అయితే, హైకోర్టు తీర్పునకు లోబడే బదిలీల్లో అంతిమ నిర్ణయం ఉంటుందని పేర్కొంది. దీనికి ఒప్పుకుంటూ లిఖితపూర్వక ఆమోదపత్రం సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ మే 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సర్వీస్ వదులుకోవాల్సిందేనని కోర్టు తీర్పు ఇస్తే బదిలీ అయినవాళ్లు దానికి కట్టుబడే ఉండాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేడర్ టీచర్లు 2,895 మంది, మల్టీ జోనల్ స్థాయిలో 8 మంది, జోనల్ కేడర్‌లో ఇద్దరు పరస్పర బదిలీలు కోరుకున్నారు.
చదవండి:
Good News: కేజీబీవీల్లో వెయ్యిమంది టీచర్ల నియామకం
Teachers Jobs: హెస్కూళ్లలో సీబీఎస్ఈ విధానం.. 1,12,853 మంది సబ్జెక్టు టీచర్లు అవసరం
Published date : 27 May 2022 05:19PM