250 Jobs: జెన్‌కోలో ఏఈ పోస్టులు
Electrical, Civil, Mechanical, Telecommunication విభాగాల్లో AE పోస్టులను భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తికాకపోవడంతో పోస్టుల సంఖ్యపై స్పష్టత రాలేదు. దాదాపు 150 AE(Electrical), 88 AE (Civil) పోస్టులు ఉండనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. మిగిలిన పోస్టులు మెకానికల్, Telecommunication విభాగాల్లో భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ జారీకి కనీసం నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. జెన్‌కో స్వయంగా నోటిఫికేషన్ జారీ చేయనుండగా, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ జరగనుంది. రాతపరీక్ష నిర్వహణ బాధ్యతను రాష్ట్రంలోని ఏదైనా యూనివర్సిటీకి అప్పగించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్వహణ అవసరాల కోసం ఏఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కోసం ఇప్పుడు ఏఈలను భర్తీ చేయాలని భావిస్తే.. మరో 130 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. త్వరలో నియామకాలపై జెన్‌కో యాజమాన్యం నిర్ణయం తీసుకోనుంది.
చదవండి: