TS 10th Class Pass Percentage 2022: పదో తరగతి ఫలితాల్లో 11,343 మందికి 10 జీపీఏ.. ఇంకా..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో 11,343 మందికి 10 జీపీఏ.. ఇంకా.. 11,343 మందికి పదికి పది జీపీఏ వస్తే, ఇందులో 9,484 మంది ప్రైవేటు స్కూల్ విద్యార్థులే ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో (408 మంది) బీసీ వెల్ఫేర్ విద్యార్థులున్నారు. ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులు కేవలం 30 మందికే టెన్ బై టెన్ జీపీఏ వచ్చింది. సబ్జెక్టుల వారీ ఉత్తీర్ణతను పరిశీలిస్తే సాంఘిక శాస్త్రంలో ఉత్తీర్ణత (99.50) ఎక్కు వగా ఉంది. తృతీయ భాష ద్వితీయ స్థానంలో నిలిచింది. మాధ్యమం వారీగా పరిశీలిస్తే.. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 92.15 శాతం మంది ఉత్తీర్ణులైతే, తెలుగు మీడియం విద్యార్థులు 83.99 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య (స్కూళ్ళ వారీగా).. :
స్కూల్స్ ఎంతమంది
ఎయిడెడ్ 81
ఆశ్రమ పాఠశాలలు 03
బీసీ వెల్ఫేర్ 408
ప్రభుత్వ స్కూల్స్ 30
కేజీబీవీ 64
మోడల్ స్కూల్స్ 288
ప్రైవేటు స్కూల్స్ 9,484
రెసిడెన్షియల్ 173
మినీ రెసిడెన్షియల్ 112
సోషల్ వెల్ఫేర్ 327
ట్రైబల్ వెల్ఫేర్ 47
జెడ్పీ స్కూల్స్ 326
సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత :
సబ్జెక్టు ఉత్తీర్ణత శాతం
మొదటి భాష 95.74
ద్వితీయ భాష 99.83
తృతీయ భాష 98.74
గణితం 95.98
సామాన్య శాస్త్రం 96.14
సాంఘిక శాస్త్రం 99.50
మీడియం వారీగా ఉత్తీర్ణత..:
మీడియం ఉత్తీర్ణత శాతం
తెలుగు 83.99
ఆంగ్లం 92.15
ఉర్దూ 79.93
ఇతర మాధ్యమాలు 88.25