Tenth Class: పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. సిలబస్ కుదింపు..
Sakshi Education
మే నెలలో జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి జిల్లా విద్యా శాఖాధికారులను ఆదేశించారు.
ఐదు లక్ష లకుపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకా శం ఉందని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగ కుం డా చూడాలని సూచించారు. పాఠశాల విద్య సంచా లకుల కార్యాలయంలో ఏప్రిల్ 6న జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో ఆమె మాట్లా డారు. కరోనా వల్ల ప్రత్యక్ష తరగతులు ఆల స్యంగా మొదలయ్యాయని, అందుకే పదోతరగతి పరీక్ష లను 11 పేపర్ల నుంచి ఆరింటికి కుదించినట్లు తెలిపారు. సిలబస్‌ను 70 శాతానికి కుదించడం, ?పరీక్షాసమయాన్ని అరగంట పెంచడం, ప్రశ్నా పత్రంలో అధిక చాయిస్ కల్పించడం గురించి విద్యార్థులకు తెలిసేలా ప్రచారం చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పల కోసం ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
చదవండి:
మోడల్ పేపర్లు కోసం క్లిక్ చేయండి
Published date : 07 Apr 2022 05:16PM