Collector Venkatesh Dhotre: విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి
Sakshi Education
ఆసిఫాబాద్ రూరల్: విద్యార్థులను విజ్ఞానంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం మాలన్‌గొంది గ్రామంలోని గిరిజన పాఠశాలను ఫిబ్రవరి 4న తనిఖీ చేశారు.

వంటశాల, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. వంటకు తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులు వినియోగించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.
చదవండి: TG TET Results Release: టెట్ ఫలితాలు విడుదల.. ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి!
అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో విధుల్లో అలసత్వం ప్రదర్శించిన కార్యదర్శి ప్రసాద్‌కు షోకాజ్ నో టీసులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వసతులు మెరుగుపర్చాలని సూచించారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 06 Feb 2025 08:58AM