Tenth Class: ‘పది’కి ప్రత్యేక తరగతులు
ఉత్తీర్ణత శాతం పెంచే ఆలోచనతో విద్యాశాఖ ఆదేశాలతో మండల పరిధిలోని పదో తరగతి విద్యార్థులను పరీక్షల దిశగా సన్నద్ధం చేస్తున్నారు. మండల పరిధిలోని పది జెడ్పీహెచ్‌ఎస్‌లు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 653 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పదో తరగతి ఫలితాల్లో నంబర్ వన్ స్థానంలో ఉంచాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మండల పరిధిలోని పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా బోధిస్తున్నారు. విద్యార్ధులను గ్రూపుగా విభజించి పాఠ్యాంశాలను రివిజన్ చేయిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు ప్రత్యేక తరగతులను కొనసాగిస్తామని చెప్పారు. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం తరగతులు తీసుకుంటున్నామని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు తెలిపారు.
సబ్జెక్టుల్లో పట్టు వచ్చేంత వరకు విద్యార్థులపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. నెలలో నాలుగుమార్లు యూనిట్ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతీ రోజు నోట్స్ రాయడంతో పాటు డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులు కనీసం ఉత్తీర్ణత సాధించేలా సాధన చేయిస్తున్నారు.
ప్రతీ విద్యార్థిపై దృష్టి
- ఉత్తమ జీపీఏల సాధనే లక్ష్యం
- ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు
ఉత్తమ జీపీఏ సాధనకు..
ప్రతి రోజు ఒక సబ్జెక్టుపై స్లిప్ టెస్టు నిర్వహిస్తున్నాం. పదవ తరగతి విద్యార్ధులు ప్రతి రోజు పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఉదయం నుంచి సా యంత్రం వరకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నాం. ప్రతీ సబ్జెక్టులో ఉత్తమ మార్కులు సాధించే లా విద్యార్థులను తయారుచేస్తున్నాం. వెనుకబడిన విద్యార్థులకు పట్టుసాధించే వరకు తరగతులను తీసుకుంటున్నాం.
– కృష్ణ, హెచ్‌ఎం, కడుమూరు