Tenth Class Public Exams 2024: పదో తరగతి లో ఏడు పేపర్లు
జనగామ రూరల్: మరో నెలపదిహేను రోజుల్లో పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ విద్యాసంవత్సరం టెన్త్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా సమయంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రోజుకు ఒక్కటి చొప్పున నిర్వహించగా ప్రస్తుతం పరీక్షలో మార్పులు చేశారు. మొత్తం ఆరు సబ్జెక్టులకు ఏడు పేపర్లు ఉంటాయి. సైన్స్‌లో రెండు పేపర్లు ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్‌లో వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. సైన్స్‌ను రెండు విభాగాలుగా చేసి 50 మార్కుల చొప్పున కేటాయించారు. మిగతా సబ్జెక్ట్‌లకు సంబంధించి యాథావిధిగా 100 మార్కులతో పేపర్లు ఉంటాయి. దీంతో కొంత సైన్స్ సబ్జెక్ట్‌లో పాఠ్యాంశాల ప్రశ్నల స్థాయిని గుర్తుంచుకోవడం కఠి న ప్రశ్నలపై సమయం లేక పోవడం వంటి ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఉన్నాయి.
రెండేళ్లగా ఒకే పేపర్
కరోనా కాలం తర్వాత 2021 నుంచి ఒకే పేపర్‌లో పదో తరగతి పరీక్షలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతున్నాయి. దీంతో రెండు సైన్స్ పేపర్లు వెంటవెంటనే ఉండడంతో విద్యార్థులు కొంత మానసికంగా ఒత్తికి గురై ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పోరాటం వినతుల మేరకు సైన్స్‌లో రెండు పేపర్లు నిర్వహించేందుకు విద్యాశాఖ సుముఖతను వ్యక్తం చేసి రెండు విభాగాలుగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ పరీక్ష షెడ్యూల్డ్ రూపొందించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం సాంఘిక శాస్త్రంలో ఒక్కొక్క ఉపాధ్యాయుడు బోధిస్తుండగా వాటి మాదిరిగానే సైన్స్‌లో కూడా ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్‌లో వేర్వేరుగా బోధిస్తున్నారు.
ప్రత్యేక తరగతుల నిర్వహణ
పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికలను సిద్ధం చేసి వాటికి అనుగుణంగా తగు సమయంలో సబ్జెక్ట్‌లు పూర్తిచేయడంతో పాటు ఎన్నిసార్లు రివిజన్ చేయాలో వెనుకబడిన విద్యార్థులకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలో ఆలోచించి ప్రత్యేక బోధన చేపడుతున్నారు. గత సంవత్సరం జిల్లా 10 ర్యాంక్‌లో నిలవగా ఈ విద్యా సంవత్సరం మొదటి ర్యాంక్ సాధించేలా తగు చర్యలు తీసుకుంటున్నారు. విద్యాశాఖ నిర్ణయించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం పరీక్షల వరకు ప్రతి రోజు గంట పాటు అదనంగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో రోజువారీగా స్లిప్ టెస్ట్‌లు పెడుతున్నారు. విద్యార్థులకు ఏమైన సందేహాలు ఉంటే సంబంధిత ఉపాధ్యాయులకు నేరుగా సెల్ ఫోన్ ద్వారా తెలిపే అవకాశాలన్ని కల్పించారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.
పదో తరగతి విద్యార్థుల వివరాలు
బాలికలు : 3,559
బాలురు : 3133
మొత్తం : 6,692
పాఠశాలలు : 182
విద్యాసంవత్సరం ఉత్తీర్ణత శాతం
- 2016–2017 93.56
- 2017 –2018 88.38
- 2018–2019 97.15
- 2019–2020 100.00
- 2020–2021 100.00
- 2021–2022 94.72
సైన్స్ సబ్జెక్ట్‌కు రెండు పేపర్లు
- మిగతా వాటికి ఒక్కొక్కటి చొప్పున పరీక్ష
- విద్యార్థులపై తగ్గనున్న ఒత్తిడి
- జిల్లాలో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా కృషి
- హాజరుకానున్న 6,692 మంది విద్యార్థులు
విద్యాశాఖ నిర్ణయం మంచిదే..
పదో తరగతి పరీక్షలో ఏడు పేపర్లకు షెడ్యూల్డ్ ప్రకటించింది. ఫిజికల్ సైన్స్‌లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచి వెసులుబాటు కల్పించింది. పరీక్ష రాసి ఎక్కువ మార్కులు సాధించేందుకు ఈ షెడ్యూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.