Department of Education: విద్యార్థులను గుర్తించడం అందరి బాధ్యత
Sakshi Education
బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించడం అందరి బాధ్యత. ముఖ్యంగా తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఎక్కడైనా బడి బయట విద్యార్థులు కనిపిస్తే ఆ క్లస్టర్ పరిధిలోని సీఆర్పీకి లేదా మండల విద్యాశాఖ అధికారికి తెలియజేయాలి.
చదవండి: Schools in Village: ఈ గ్రామంలో బడి 50 ఏళ్ళనాటిది.. ఇప్పుడు ఇది పరిస్థితి..
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి వారి వయసుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పిస్తాం. విద్యా హక్కు చట్టం ప్రకారం తల్లిదండ్రుల అనుమతితో ఎనిమిదో తరగతి లోపు విద్యార్థులకు ప్రవేశం కల్పించడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు లేని పిల్లల్ని గమనిస్తే బాలురకు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో, బాలికలకు కేజీబీవీలలో ప్రవేశం కల్పిస్తాము.
– డాక్టర్ మహమ్మద్ అబ్దుల్‌హై, జిల్లా విద్యాశాఖ అధికారి
Published date : 08 Jan 2024 12:01PM