Tenth Class: ఆరు పేపర్లపై అప్రమత్తం
ఈ దిశగా చేపట్టాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేయాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం జిల్లా విద్యా శాఖాధి కారులను ఆదేశించింది. ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల ఫలితాలను ఉన్నతాధికారులు విశ్లేషించారు. కోవిడ్ ముందు, తర్వాత రాష్ట్రంలో టెన్త్ ఫలితాలను పరిశీలించారు. 2015లో రాష్ట్రంలో 77.56 శాతం టెన్త్ ఉత్తీర్ణత ఉంటే, 2019 నాటికి 92.43 శాతానికి చేరింది. కోవిడ్ తర్వాత తొలిసారి (2022) నిర్వహించిన పరీ క్షల్లో 90 శాతమే ఉత్తీర్ణులయ్యారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
కోవిడ్‌లో దెబ్బతిన్న అభ్యసన ప్రమాణాలు
ప్రస్తుతం టెన్త్‌లో ఉన్న విద్యార్థులు కోవిడ్‌కు ముందు ఏడవ తరగతిలో ఉన్నారు. ఆ తర్వాత 8, 9 తరగతుల్లో అనేక పరిణామాలు చోటు చేసుకు న్నాయి. 2020, 21లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారు. దీంతో అభ్య సన ప్రమాణాలు పడిపోయాయని అధికారులు చెబు తున్నారు. 2022 టెన్త్ పరీక్షల్లో 70% సిలబస్ మాత్రమే ఇచ్చారు. 2023లో జరిగే పరీక్షల్లో మాత్రం వంద శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహిస్తు న్నారు. దీనికి తోడు కొత్తగా ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. సైన్స్ పేపర్ రెండు పార్ట్‌లుగా ఇస్తు న్నారు. అందువల్ల ఆరు పేపర్లపై అవగాహన పెంచా ల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. 11 పేపర్లు ఉన్నప్పుడు ప్రతి సబ్జెక్టు (హిందీ మినహా) రెండు పేపర్లుగా ఉండేది. 40 మార్కులకు 14 మార్కుల చొప్పున, రెండు పేపర్లలో కనిష్టంగా 28 మార్కులు వస్తే (ఇంటర్నల్స్ కలిపితే) ఉత్తీర్ణులవుతారు. ఒక్కోటి 40 మార్కుల పేపర్ ఉన్నప్పుడు ఒకటి, రెండు మార్కులు తక్కువ వచ్చినా చూసీచూడనట్టు వ్యవహరించే వారు. దీనివల్ల మూల్యాంకనంలో రెండు పేపర్లలోనూ 4 మార్కుల వరకు మేలు జరిగే అవకాశం ఉండేది. ఇప్పుడు 80 మార్కుల పేపర్ ఒక్కటే కావడం వల్ల ఒక పేపర్‌లో 28 మార్కులైనా తెచ్చుకుని, అంతర్గత పరీక్షల్లో 20 మార్కులకు 7 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.